హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు ప్లస్ ఉందా!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష టి‌డి‌పి నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు, తమ పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్‌తో ఆ ఎమ్మెల్యేలు టి‌డి‌పిని వీడి డైరక్ట్‌గా వైసీపీలో చేరకుండా జగన్‌కు మద్ధతు తెలిపారు...అంటే పరోక్షంగా వారు కూడా వైసీపీ ఎమ్మెల్యేలనే చెప్పాలి. అలా జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి కూడా ఒకరు.
గుంటూరు నగరంలో టీడీపీ తరుపున పనిచేసిన మద్దాలి...2014 ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో పోటీ చేసి, జగన్ గాలిలో కూడా మంచి మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ టి‌డి‌పి అధికారంలోకి రాకపోవడంతో మద్దాలి గిరికి ఆర్ధికంగా ఇబ్బందులు వచ్చాయి..అలాగే గతంలో చేసిన కొన్ని కాంట్రాక్ట్ డబ్బులు పెండింగ్‌లో పడిపోయాయి. ఈ క్రమంలోనే ఆయన టి‌డి‌పిని వీడి వైసీపీలోకి వెళ్లారని టి‌డి‌పి శ్రేణులు ఆరోపిస్తూ ఉంటాయి.


ఆ ఆరోపణలు ఎలా ఉన్నా సరే గిరి...వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. వైసీపీలోకి వెళ్ళాక గిరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అధికార పార్టీలో ఉండటంతో...మంచిగానే పనులు చేసుకుంటున్నారు....ప్రభుత్వం తరుపున అమలవుతున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు అంటే నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, జగనన్న కాలనీల ద్వారా పేదలకు ఇళ్ళు. కొత్తగా వార్డు సచివాలయాలు లాంటి నిర్మాణాలు జరిగాయి.
అంతే గానీ వేరే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు. అలాగే పన్నుల రూపంలో ప్రజలపై భారం బాగానే పడింది. అటు రాజధాని అమరావతిని మార్చేయడం లాంటి అంశాలు మద్దాలికి మైనస్..ఇటు టి‌డి‌పి తరుపున వెస్ట్‌లో కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. వెస్ట్ కాస్త టి‌డి‌పికి అనుకూలమైన నియోజకవర్గం కావడంతో నెక్స్ట్ ఎన్నికల్లో వెస్ట్‌లో మద్దాలికి కాస్త ఇబ్బందయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి మద్దాలికి ప్లస్ ఎక్కువగా ఏమి కనిపించడం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: