రాత్రి సమయంలో గొంతు నిండిపోతుందా?.. ఈ నిర్లక్ష్యం వద్దు...!
లేదా అర్ధరాత్రి దాహం అనిపిస్తే నీళ్లు తాగుతారు. ఈ అలవాటు కొంతమందికి ఉంటుంది. అయితే మరికొంతమంది ఎంత గాడ నిద్రలో ఉన్న గొంతు ఎండిపోయిన ఫీలింగ్ తో మళ్లీ మళ్లీ నిద్రలేచి నీళ్లు తాగుతూ ఉంటారు. నిజానికి రాత్రి సమయంలో నీరు తాగటం లేదా గొంతు పొడిబారటం అనేది సాధారణ విషయం. అయితే ఇలా ఎప్పుడో ఒకసారి జరిగే అది సర్వసాధారణం విషయమే... కానీ తరచుగా ఇలా జరుగుతుంటే మాత్రం అది మామూలు విషయం కాదు. రాత్రి సమయంలో గొంతు పొడి బారడం కొన్ని వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే రాత్రి సమయంలో పొడి గొంతు సమస్యతో ఇబ్బంది పడుతుంటే దానిని విమర్శించుకోవద్దు. ఇలా చేయటం వల్ల ప్రమాదం కూడా ఏర్పడుతుంది. అందువల్ల ఏ వ్యాధికి సంకేతం గా రాత్రి గొంతు పొడిబారుతుందో అని ముందుగా తెలుసుకోవాలి. తరచుగా దాహం, గొంతు పొడిబారడం మధుమేహం ప్రారంభ లక్షణాలు అని నమ్ముతారు.
అంతేకాదు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలనిపిస్తున్న లేదా చాలా త్వరగా అలసిపోయినట్లు అనిపించిన మీరు వీలైనంత త్వరగా రక్తంలో చక్కెర స్థాయిని పరీక్ష చేయించుకోవాలి. రాత్రి సమయంలో గొంతు పొడిబారడానికి ఒక కారణం లాలాజలం తక్కువ ఉత్పత్తి. ఎవరి నోటిలో నైనా లాలాజలం ఉత్పత్తి కాకపోతే... నోరు పొడిగా ఉంటుంది. పదేపదే దాహం వేస్తుంది. ఇది కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా జరగవచ్చు. నిద్రపోయేటప్పుడు నోరు తెరిచి పడుకున్నా, లేదా గురగా పెట్టిన గొంతు పొడిబారటం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారి తీయవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎటువంటి ఇబ్బంది పడుతుంటే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి.