మీ స్కిన్ టైప్ ఏది...? ఎలా డిసైడ్ అవుతుందో తెలుసా?

lakhmi saranya
చాలామందికి స్కిన్ ఎలా ఉంటుందో డిసైడ్ అవ్వదు. ఎలా ఉంటుందో తెలియక ఏ క్రీమ్స్ వాడాలో కూడా గుర్తు ఉంచుకోరు. మానవ శరీరంలో లార్జెస్ట్ ఆర్గాన్ ఏదైనా ఉందంటే అది చర్మమే. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవటం, శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం నీ చర్మ రకాల పైన అవగాహన అవసరం. ఎందుకంటే ఒక్కో టైప్ రకానికి ఒక్కో విధమైన సంరక్షణ పద్ధతులు, ఉత్పత్తులు అవసరం అవుతుంటాయి. అంతేకాకుండా ఇటీవల అందం, ఆరోగ్యం వంటి విషయాల పట్ల యువతలో ఆసక్తి బాగా పెరుగుతోంది. ఉన్నంతలో అట్రాక్టివ్ గా కనిపించాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. అయితే మీ స్కిన్ టైప్ గురించి అవగాహన కలిగి ఉన్నప్పుడే అది సాధ్యం అవుతుంది అంటున్నారు.
 అయితే చర్మ రకాలు ఎన్ని? ఎలా ఏర్పడతాయి? దేనికి ఎలాంటి కేర్ అవసరమో చూద్దాం. ఒక్కో వ్యక్తి ఒక్కో రకమైన చర్మ తత్వాన్ని లేదా రక్తాన్ని కలిగి ఉంటారు. ఆయా వ్యక్తుల జీవన శైలితో పాటు జన్యుశాస్త్రం, ఏజ్, హార్మోన్లు, ఒత్తిడి, ఆహారం, యాక్టివిటీస్ లెవెల్స్, ఎన్విరాన్ మెంటల్ ఫ్యాక్టర్స్ వంటివి ఇందులో కిలకపాత్ర పోషిస్తాయని అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజి అధ్యాయనం పేర్కొంటున్నది. దీని ప్రకారం... పొడి చర్మం, జిడ్డు చర్మం, నార్మల్ స్కిన్, కాంబినేషన్ లేదా సెన్సిటివ్ స్కిన్ ..
ఇలా మొత్తం 5 రకాలు ఉన్నాయి. మీ బాడీలో తగినంత సెబమ్ ను ఉత్పత్తి కానప్పుడు సెబాషియన్ గ్రంథాల ద్వారా కొన్ని జుట్టు పదార్థాలు తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. దీనిని బట్టి మీది డ్రై స్కిన్ టైప్ అంటున్నారు నిపుణులు. నిజానికిది స్మాల్ ఫంగల్ వల్ల ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు సోకితే ముక్కు, కనుబొమ్మలా చుట్టూ దద్దుర్లకు కారణం అవుతుంది. కాబట్టి ఇలాంటి చర్మ రకం ఉన్నప్పుడు సంరక్షణ కోసం తేమగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకోసం ఒక సున్నితమైన క్లెన్సర్ అండ్ హూమెక్వింట్స్ కలిగి ఉండే మాయిశ్చరైజర్ ని ఎంచుకోవాలంటున్నారు నిపుణులు. జిడ్డు చర్మం లేదా ఆయిల్ స్కిన్ టైప్ కలిగి ఉన్నట్లయితే సెబమ్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల స్వేద రంద్రాలు విస్తరిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: