కీబోర్డ్ లో కీస్ ఎందుకు ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో ఉండవు?
అసలు ఎందుకు ఈ కీస్ ఇలా ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఎందుకు ఉండవు? అనే ఆలోచన మీకు వచ్చినట్లయితే దీన్ని గురించి తెలుసుకోండి. ముందుగా మనకు కీబోర్డ్ ల కంటే ముందు టైప్ రైటర్లు ఉండేవి. ఈ టైప్ రైటర్ ను మొదటిసారిగా 1575 లో తయారు చేశారు. అందులో కొన్ని కిస్ మాత్రమే ఉండేవి. ఆ తరువాత 1714లో పూర్తిగా ఇంగ్లీష్ అక్షరాలతో టైప్ రైటర్ ను తయారు చేశారు. అయితే అందులో కీస్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండేవట. నీటి తరువాత మోడర్న్ టైప్ రైటర్ ను 1829 లో అమెరికాకు చెందిన విలియం ఆస్టిన్ బర్డ్ తయారు చెయ్యగా...
1868 లో క్రిస్టోఫర్ లాథమ్ ఫోల్స్ తొలి కమర్షియల్ టైప్ రైటర్ ను రూపొందించారు. అందులో కీస్ A, E, I, Y, U, O గా ఉండేవి. అయితే ఈ కీబోర్డ్ లేఅవుట్ ని ఎన్నిసార్లు మార్చిన టైప్ రైటర్లు టైపింగ్ చేయడానికి ఇబ్బందులు పడేవారు. దీనిపై అనేక పరిశోధనలు జరిపిన తరువాత చివరిగా క్విర్టి కీబోర్డ్ ను తయారు చేశారు. ఈ క్వర్టీ కీబోర్డ్ లో లెటర్స్ Q, w, E, R, T, Y, U, I, O, P గా ఉండేవి. అంటే ప్రస్తుతం మనం వాడుతున్న కీబోర్డ్. ఈ క్వర్టీ లేట్అవుట్ ను లాథమ్ పోల్స్ 12000 డాలర్లకు రెమింగ్టన్ ఆర్మ్స్ కంపేనీ అమ్మినట్లు చరిత్ర చెబుతోంది. అయితే ఈ టైప్ రైటర్ కొన్ని రోజుల్లోనే 4,0000 పైగా అమ్మకాలు జరిగాయి. అపర్ కేస్, లోయర్ కేస్ తో అప్పుడే తొలి టైప్ రైటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో సులువుగా ఉండటంతో పెద్దపెద్ద కంపెనీలు కూడా ఈ క్వర్టీ కీబోర్డ్ నే ఫాలో అయ్యేవి.