శీతాకాలంలో గుండె ఆరోగ్యంగా ఉండాలా...? ఈ రెడ్ ఫుడ్స్ తినండి చాలు!

lakhmi saranya
శీతాకాలం వచ్చిందంటే చాలు ఏ ఫుడ్స్ తినాలో తెలియక సతమతమవుతాము. చలికాలంలో చాలా చలి ఎక్కువగా ఉండటం వల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు దరిచేరతాయి. చలికాలంలో పొడి వాతావరణం కారణంగా రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోస వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటుగా గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది. శీతాకాలంలో గుండెపై ఒత్తిడి అధికంగా ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరంపై చల్లటి వాతావరణం ఎఫెక్ట్ పడుతుంది.
శరీరానికి తగినం రక్తం సరఫరా చేసేందుకు, శరీరం లోపల మెచ్చగా ఉండటంలో గుండె పని ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్తనాళాలు మూసుకుపోయి గుండె, మెదడుకు వెళ్లే ధమనులను అడ్డుకుంటుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో గుండెపోటు రెటు 53 శాతానికి పెరిగిందని బ్రిటిష్ హార్ట్ పౌండేషన్ చేసిన ఆధ్యాయనంలో తేలింది. చల్లటి వాతావరణం గుండెకు ప్రమాదమని నిపుణులు తెలిపారు. ఇలాంటి సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ ఫుడ్ ను తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
 అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ధమనుల్లో బ్లాక్స్ ను నిరోధించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తపోటును నియంతరించడంలో ఉపయోగపడుతుంది. క్రాన్ బెర్రిస్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఎన్నో సూక్ష్మపోషకాలు అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల చెడు కొలెస్ట్రాలను తగ్గించుకోవచ్చు. రెడ్ యాపిల్ లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు 2 యూపిల్స్ తినటం వల్ల కొలెస్ట్రాల్ శాతం 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: