కల నెరవేరేనా...? జంటల్లో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు!
ఆ ఆనందం ఆవిరైనంత ఇదిగా ఫీలవుతుంటారు కొందరు. ప్రస్తుతం భారతదేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలామంది జంటల పరిస్థితి ఇదేనని నివేదికలు సైతం వెల్లడించింది. కారణాలు ఏమైనా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వంధ్యత్వం పెరుగుతోంది. రీ ప్రొడక్టివ్ హాల్త్ ఇష్యూస్ తో సంతానాన్ని పొందాలన్నా తమ కళా నెరవేరడం లేదని ఎన్నో జంటలు ఆందోళన చెందుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2024 గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేని సమస్యను ఎదుర్కొంటున్నారు. 19 శాతం మహిళలు పెళైన ఏడాది తర్వాత గర్భం దాల్చలేకపోతున్నారు.
మరో 10 శాతం మంది పెళ్లయిన రెండేళ్ల తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 40 శాతం మంది ఇతరుల ద్వారా అనుభూతి పొందుతుండగా, 36 శాతం మంది మాత్రం తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల నుంచి కూడా అవేళనలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. దీంతో మానసిక ఆందోళన, ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మరో 78 శాతం మంది నిస్సహాయ భవానితో పోరాడుతుండగా, 49 శాతం మంది తమకు సంతానం లేదని కారణంతో సమాజం చిన్న చూపు చూస్తుందని భయపడుతున్నాడు. ప్రస్తుతం స్త్రీ, పురుషుల్లో ఇన్ ఫెర్టిలిటి ఇష్యూస్ పెరిగేందుకు అనేక కారణాలు ఉన్నాయి. శారీరక పరమైన లోపాలు, మానసిక ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లు, జీవనం శైలిలో మార్పులు, పర్యావరణ పరిస్థితులు ఆందోళన భాగమైనని నిపుణులు పేర్కొంటున్నారు.