కొత్తగా పెళ్లయిందా?.. అయితే మన దేశంలోనే బెస్ట్ హనీ మూన్ డెస్టినేషన్స్ ఇవే..!

lakhmi saranya
కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కి వెళ్ళటం కామన్ గా మారిపోయింది. ఈ కాలంలో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు హనీమూన్ కి వెళ్తున్నారు. కొత్త కొత్త ప్లేస్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్... ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివాహాలు భారీ సంఖ్యలో నమోదవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన జంటలు బెస్ట్ అండ్ సేఫ్ హనీమూన్ డెస్టినేషన్ కోసం ఇటీవల ఆన్ లైన్ లో ఎక్కువ సెర్చ్ చేయడం పెరిగిపోయింది. అందమైన పర్యాటక ప్రాంతాలేవి? వాటి ప్రత్యేకత ఏమిటి? ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్లాన్ చేసుకుంటారు చాలామంది.
అలాంటి వారి కోసం మన దేశంలో ఆకట్టుకునే హనీమూన్ డెస్టినేషన్స్ స్పాట్స్ ఎన్నో ఉన్నాయి అంటున్నారు పర్యాటక నిపుణులు. అలాంటి వాటిలో కొన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న సిమ్లా ఆహ్లాదకరమైన శీతల వాతావరణoకి ప్రసిద్ధి. కపుల్స్ కు ఫుల్ రొమాంటిక్ ఫీల్ ఇచ్చే బ్యూటిఫుల్ హనీమూన్ డెస్టినేషన్ గాను పేర్కొంటారు. ఇక్కడి అందమైన పర్వతాలు, పురాతన శిల్పలు ఆకట్టుకుంటాయి. పచ్చిక బయళ్లు చూడముచ్చటగా ఉంటాయి. హైదరాబాద్ నుంచి దాదాపు 19 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వింటర్లో సిమ్లాను ఒక్కసారైనా చూసి తీరాలంటారు చాలామంది. అంత అందంగా ఉంటుంది మరి! కొత్తగా వివాహమై హనీమూన్ కోసం ఎదురు చూస్తున్నా కపుల్స్ కోసం అండమాన్ నికోబార్ దీపుల్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.
చూడటానికి అందంగా, ఆకర్షణియంగా ఉంటాయి. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం జంటలను ఇట్టే ఆకట్టుకుంటుంది. అదో కొత్త ప్రపంచంలా, భూతల స్వర్గంలో అనిపిస్తుందని సందర్శకులు చెప్తుంటారు. స్వచ్ఛమైన నీటితో కూడిన విశాలమైన బీచ్ లు ఆకట్టుకుంటాయి. అక్కడి వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ను నూతన దంపతులు మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ నుంచి సుమారు 1,682 కిలోమీటర్ల దూరంలో ఈ దివులు ఉంటాయి. ఫ్లైట్ లో వెళ్లటం బెస్ట్ ఆప్షన్ గా నిపుణులు పేర్కొంటున్నారు. అందమైన ప్రకృతి అందాల సెలవు శ్రీనగర్. శీతాకాలంలో ఇది మరింత ఆకట్టుకుంటుంది. కాశ్మీర్ లోని ఈ ప్రాంతం ఎత్తయిన హిమాలయ పర్వతాలతో అలరిస్తుంది. మంచు కురుస్తున్న ఉదయపు, సాయంత్రపు వేళలు కొత్త దంపతులను అందమైన ఊహల్లో విహారింజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అక్కడి సరస్సులు స్వచ్ఛమైన తేట నీటితో, తెలియాడే తయారాలకులతో అలరిస్తాయి. నీటిలో చెక్క బోట్ల రై విహారించడం జంటలకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: