జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా?.. అయితే ఈ రెండు విషయాలు తప్పక గుర్తుంచుకోండి..!
గతంలో మిమ్మల్ని బాధించినా వస్తువులు, గుర్తులను చెరిపేయడానికి ట్రైయ్ చెయ్యండి. ఏదైనా కష్టమైనా పరిస్థితి నుండి బయటపడిన వారైతే వాటి గురించి ఆలోచించడం మానేయండి. ఇంట్లో గతానికి సంబంధించిన వస్తువులను తీసేయండి. ప్రస్తుత క్షణంలో ఆనందంగా ఉండాలంటే గదాన్ని విడిచిపెట్టండి. అలాగే, భవిష్యత్ లో ఏం జరుగుతుందో అని ఇప్పటినుంచి ఆలోచిస్తూ భయపడకండి. ప్రస్తుతం ఉన్న ప్రతిక్షణం లో ఆనందంగా ఉండండి. ప్రతిరోజు చిరునవ్వులతో మీ జీవితాన్ని ప్రారంభించండి. ఇలా చేస్తే, ఆ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.
చుట్టూ ఉండే మనుషుల బాబోద్వేగాలు, వారు సాధించిన విజయాలు, కనిపించే దృశ్యాలు అన్నిటిలో ఆనందాన్ని వెతుక్కోండి. జీవితంలో ప్రతి చిన్న విషయంలో ఆనందాన్ని వెతుక్కుంటే, గతం, భవిష్యత్ గురించి ఆలోచనలు దరిచేరవు. ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. అందులో ఉండే సంతోషకరమైన విషయాలను గుర్తు చేసుకోండి. గతంలోని బాధలు, కోపాలను మనసులో ఉంచుకుంటే, జీవితం నాశనం అవుతుంది. మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించి, ముందుకు సాగే ప్రయత్నం చేయండి. ఎవరో మీకు హాని చేశారని వారి పట్ల మనసులో పగ పెంచుకుంటే అది మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. అందువల్ల గతంలో కలిగిన బాధలు, కష్టాల గురించి ఆలోచించడం మానేసి, ముందుకు సాగండి.