లైఫ్ స్టైల్: తలకు హెన్నా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?
మనం హెన్నాను కేవలం మూడు గంటల సేపు వరకు ఉంచితే జుట్టు గోధుమ రంగులోకి మారుతుంది. ఒకవేళ హెన్నా జుట్టును ఆరడానికి సమయం దాన్ని కలిపే విధానం పైన ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.. హెన్నా రంగు గోరువెచ్చని నీటిని హెన్నా కలపడం మంచిది. హెన్నా ను ఉపయోగించుకోవడానికి కొన్ని గంటలపాటు ముందే బాగా కలిపి ఉంచాలి. జుట్టుకు పట్టించిన తర్వాత హెన్నా ను ఎంతసేపు ఉంచితే.. అంతగా లాసోన్ అణువులు కెరటిన్ లోకి వెళ్లి లోతైన రంగును కనబరుస్తాయి.
సాధారణంగా హెన్నా ప్రయోజనం బాగా కలగాలంటే సరిగ్గా ఐదు గంటల పాటు జుట్టుకు పట్టించి వదిలేయాలి. హెన్నా మిశ్రమాన్ని మీ జుట్టు పైన ఎక్కువ సేపు ఉంచితే.. పొడిగా తయారవుతుంది దీనివల్ల తలలో మంట కూడా వస్తూ ఉంటుంది. ఈ రంగు దాదాపుగా రెండు నెలల వరకు ఉంటుంది. హెన్నా పూర్తిగా జుట్టుకి బాగా అప్లై చేయాలి అంటే వేరు వేరు చేసి పలు బాగాలలో హెన్నా ను పట్టించాలి. అంతేకాకుండా అలా పట్టించిన తర్వాత ఏదైనా గుడ్డతో గట్టిగా కట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే స్నానం చేసేటప్పుడు బయట ఉష్ణోగ్రత బట్టి ఎంచుకోవాలి.