లైఫ్ స్టైల్: వేపాకుతో ఇలా చేస్తే ఆరోగ్య సమస్యలు ఉండవా..?

Divya
మన దేశ వైద్య చరిత్రలోనే వేపాకు చాలా విశిష్టత ఉన్నదని చెప్పవచ్చు.. వేపలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉండడంతో పాటు వేప చెట్టులోని ప్రతిభాగం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో తెలిపిన ప్రకారం వేప ఆకు, కొమ్మలు, గింజలు, పండ్లు ,పూలు ,వేర్లు కూడా ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడతాయి. ఇది మానవుని ఆరోగ్యాన్ని పెంపొందించడంలో వేపాకు చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎసిడిటీ, యూరిన్, చర్మ వ్యాధుల నివారణకు కూడా వీటిని మనం ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు కూడా వేపాకు తినడం చాలా మంచిది. వేపాకు వల్ల ఇప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
1). వేపాకు తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పరుస్తుంది.
2). తరచూ వేపాకు తింటూ ఉండడం వల్ల అలసట అనేది దూరమవుతుంది.
3). వేపాకు బాగా నూరి ఏదైనా గాయాలు అయినప్పుడు అక్కడ పట్టిస్తే ఆ గాయాలు మటుమాయం అవుతాయి.
4). వికారం,  వాంతులు వంటివి వచ్చేటప్పుడు వేపాకును కాస్త తినడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.
5). వేపాకు దగ్గు,  ఎక్కువ దాహం వేసే వారికి వీటిని తింటూ ఉండటం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.

6).వేప పొడిని గోరువెచ్చని నీటిలో లేదా కలుపుకొని పేస్టులా చేసుకుని ముఖం మీద పట్టించినట్లు అయితే మొటిమలు నల్లమచ్చలు అనేవి దూరమవుతాయి. అంతేకాకుండా వేప ఆకులతో స్నానం చేస్తే చర్మ సమస్యలు కూడా ఉండవు.
 7).ఇక వేపనీటిని కషాయంగా చేసుకొని తాగడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు.

8). ప్రతిరోజు కొన్ని వేప ఆకులను రెండు వారాలపాటు తిన్నట్లు అయితే మన శరీరంలో రక్తం బాగా శుద్ధి అవుతుంది. మన పూర్వీకుల సైతం ఎక్కువగా పళ్ళను తిక్కడానికి వేప పుల్లలని ఉపయోగించేవారు. దీంతో పళ్ళు చాలా బలంగా తయారవుతాయి. షుగర్ పేషెంట్లు సైతం వీటిని తినడం వల్ల షుగర్ తగ్గుముఖం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: