లైఫ్ స్టైల్: పసుపు అధికంగా వాడుతున్నారా అయితే తస్మాత్ జాగ్రత్త ..!

Divya
హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంట గదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించడమే కాకుండా పూజలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగల్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే మరి పసుపు కేవలం పవిత్రమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారీ అని ఆయుర్వేద నిపుణుల సైతం సూచిస్తున్నారు. కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇమిడి ఉన్న ఈ పసుపును అధికంగా తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. ఏదైనా సరే పరిమితి దాటి తీసుకుంటే దాని యొక్క చెడు ప్రభావం మనపై పడుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని వారు హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం.
నిజానికి పసుపు లో యాంటీ సెప్టిక్,  యాంటీ మైక్రోబయల్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్  గుణాలు ఉన్నాయి. అంతేకాదు మధుమేహం,  ఒత్తిడి,  అల్జీమర్స్ వంటి సమస్యలను కూడా దూరం చేసే శక్తి పసుపుకి ఉంది. కానీ మోతాదుకు మించి తీసుకుంటే కలిగే అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. ముఖ్యంగా పసుపులో ఆక్సలేట్ పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కిడ్నీలో రాళ్లను ఏర్పరుస్తుంది. అంతేకాదు దీనిని తినే ముందు పరిమాణం గురించి కూడా తెలుసుకోవాలి.
ఇక పసుపుని ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఐరన్ లోపం కూడా ఏర్పడుతుంది. దీని ఫలితంగా బలహీనత తో  పాటు ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక డయేరియా వంటి సమస్యలకు కూడా పసుపు కారణం అవుతుంది.ఇందులో ఉండే కర్కుమిన్ పొట్టలోని గ్యాస్ట్రిక్ డక్ట్ సరిగా పనిచేయకుండా ఆపుతుంది. అప్పుడు డయేరియా సమస్య వస్తుంది. ఇక చిన్నపిల్లల్లో విరోచనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది .కాబట్టి ఒక పించ్ మోతాదులో పసుపును  వాడితే ఎటువంటి రోగాలు దరిచేరవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: