భర్త ఇంట్లో నుండి వెళ్ళాక భార్యామణి ఈ పనులు చేస్తే ?

VAMSI
సాధారణంగా హిందువులు సంప్రదాయాలను, సంస్కృతులను బట్టి ఎక్కువగా నడుచుకుంటారు.  మరీ మన భారతదేశంలో ఉండే హిందువులు పాటించే సంప్రదాయాలకు అంతే లేదు అని చెప్పాలి. అందులోనూ పెద్దలు చెప్పిన మాటల్ని కూడా బాగా నమ్ముతుంటారు. ముఖ్యంగా వివాహితలు ఇలానే ఉండాలి, ఇలాంటి ఆచారాలను పాటించాలి వంటివి. కాగా పెళ్లయిన మహిళలు తమ భర్త ఇంటి నుండి ఉద్యోగ రీత్యా లేదా మరేదైనా పనుల వలన బయటకు వెళ్ళినప్పుడు ఈ అయిదు పనులను అస్సలు చేయకూడదట. ఇంతకీ ఆ అయిదు పనులు ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.
1. భర్త ఇంట్లో నుండి వెళ్ళిన తరువాత, మహిళలు తమ శరీరానికి, లేదా జుట్టుకు కానీ అస్సలు నూనె రాసుకోకూడదట. భర్త ఇంటి నుండి బయటకు వెళ్లిన వెంటనే నూనె రాసుకుంటే  భర్త ఆయుషు తగ్గుతుంది అని ఒక నమ్మకం. అందుకే కొన్ని గంటలు గడిచాక నూనె రాసుకోవచ్చట.
2.  భర్త ఇంటి నుండి వెళ్లిన తర్వాత తలస్నానం కూడా చేయరాదు అని పెద్దలు అంటారు.
3. భర్త ఇంట్లో నుండి పని నిమిత్తం బయటకు వెళ్ళాక వెంటనే నీరు పోయకూడదు. ఇంట్లో ఏదైనా ఆపద సంభవించినపుడు మాత్రమే ఇలా చేస్తుంటారు... కాబట్టి శుభ కార్యాల కోసం బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేయకూడదు అని పెద్దలు అంటుంటారు.
4.. అదే విధంగా భర్త పని మీద బయటకు వెళ్లినప్పుడు వారి భార్య గాజులు, బొట్టు అలాగే పూలు వంటి ముత్తైదువ అలంకరణ వస్తువులను తీయకూడదు. ఇది చెడ్డ శకునముగా భావిస్తారు.
5. పెళ్లయిన మహిళలు గుర్తుంచుకోవాల్సిన మరో  విషయం ఏమిటంటే, తల స్నానం చేసిన వెంటనే తడి జుట్టుకు సింధూరాన్ని పూయ కూడదు అని కూడా పెద్దలు చెబుతారు.  ఇది శుభప్రదం కాదట అందుకనే... జుట్టు పూర్తిగా ఆరిన తరువాతనే  సింధూరాన్ని నుదుటన పెట్టుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: