పులిపిర్ల సమస్య ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి!

Purushottham Vinay
ఇక పులిపిర్ల సమస్యతో బాధపడే వారు మనలో చాలా మంది ఉంటారు.ఇవి చర్మంపై బుడిపెలలా ఉండి చూడడానికి చాలా అంద విహీనంగా ఉంటాయి. ఇవి ముఖం, చేతులు ఇంకా అలాగే వేళ్లు అనే కాకుండా ఇతర శరీర భాగాలపై కూడా ఎక్కువగా వస్తాయి.ఇక ఈ పులిపిర్లు ఉన్న వారు వాడిన వస్తువులను ఇతరులు ఉపయోగించడం వల్ల, పులిపిర్లను తాకి మరో చోట చర్మాన్ని తాకడం వల్ల ఈ పులిపిర్లు వ్యాప్తి చెందుతాయి. పులిపిర్లు ఉన్న వారి వస్తువులను ఉపయోగించకపోవడం ఇంకా అలాగే వాటిని తాకిన వెంటనే చేతులను శుభ్రపరుచుకోవడం వంటివి చేయడం వల్ల పులిపిర్లు వ్యాప్తి చెందకుండా ఉంటాయి. ఇక వీటిని నిర్మూలించడానికి మనం ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆయింట్ మెంట్లను రాయడం ఇంకా వీటిని కత్తితో కోయడం అలాగే కత్తిరించడం వంటివి మనలోచాలా మంది చేస్తారు. ఇలా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇవి మరలా మరలా వస్తూనే ఉంటాయి.ఇక అలాగే ఆయుర్వేదం ద్వారా కూడా మనం ఈ పులిపిర్లను చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.


ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మేడి చెట్టును ఉపయోగించి మనం ఈ పులిపిర్ల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ మేడి చెట్టు ఆకులను లేదా కాయలను కోయగా వచ్చిన పాలను పులిపిర్లు రాలి పోయే వరకు కూడా ప్రతి రోజూ రాస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పులిపిర్లకు కారణమయ్యే వైరస్ అనేది పూర్తిగా నశించి పులిపిర్లు వాటంతట అవే రాలిపోతాయి. ఇక అంతేకాకుండా ఈ పాలను  ఉపయోగించి మనం మొలల సమస్య నుండి కూడా బయట పడవచ్చు.ఈ మేడి చెట్టు పాలను మొలలపై రాస్తూ ఉండడం వల్ల కొద్ది రోజుల్లోనే మనం ఈ సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ విధంగా మేడి చెట్టును ఉపయోగించి మనం పులిపిర్ల సమస్య నుండి, ఇంకా అలాగే అదే విధంగా మొలల సమస్య నుండి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: