తమ కూతురుకు పెళ్లి చేసే ముందు తల్లితండ్రులు ఈ విషయాలు గుర్తుంచుకోవాలి ?

VAMSI
జీవితంలో పెళ్లి అనేది మరో అధ్యాయం. పెళ్లి ముందు వరకు ఒక జీవితం పెళ్లి తర్వాత మరో జీవితం అనే చెప్పాలి. పెళ్లి తర్వాత తమకంటూ ఒక ప్రత్యేకమైన జీవితం ఏర్పడుతుంది. పెళ్లి తర్వాత అబ్బాయికైనా, అమ్మాయి కైనా క్లారిటీ అనేది అవసరం. అలాగే కొత్త కోడలు ఇంటికి వస్తున్నప్పుడు, తమ కుమార్తె ను కొత్త కాపురానికి పంపేటపుడు తల్లితండ్రులు కొన్ని కీలక విషయాలను తెలుసుకోవడం అలాగే ఆచరించడం చాలా అవసరం. ప్రతి తల్లితండ్రులు ఒక విషయం మాత్రం తప్పక గుర్తుంచుకోవాలి. ఈ రోజు మీ కూతురు వేరే ఇంటికి కోడలుగా వెళ్ళినప్పుడు ఎలా ఉండాలిగా ని మీరు అనుకుంటారో ? అదే విధంగా మరో ఇంటి నుండి మీ ఇంటికి కోడలిగా వచ్చే ఏమయినా అలాగే ఉండనివ్వాలి.
పెళ్ళికూతురు తను ఒక నూతన కుటుంబం లోకి అడుగుపెట్ట బోతుంది అని తెలుసుకున్నప్పుడు, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా వీలయినంతవరకు అడ్జస్ట్ అవడానికి తమని తాము సంసిద్ధం చేసుకోవడం ముఖ్యం. ఒకవేళ తమకి మరి అంతగా నచ్చకపోతే వారి అయిష్టాన్ని సున్నితంగా తెలిపేందుకు ప్రయత్నించాలి. అదే విధంగా వరుడు కూడా తన జీవితం లోకి ఆహ్వానించే అమ్మాయి కోసం తనని తాను  వధువుకు ఉన్నంతలో సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. ఆమెని అర్దం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే కొత్త కోడలు ఇంటికి వస్తుంది అంటే ఆమె వారి ఇంట్లో కొత్త వాతావరణానికి, పద్ధతులకు అలవాటు పడే వరకు వారికి సమయాన్ని ఇవ్వాళే తప్ప.... వారి యందు కటువుగా ఉండరాదు.
అలాగే తమ బిడ్డను అత్తారింటికి పంపే సమయంలో అక్కడ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, అలాగే వీలైనంత వరకు సర్దుకోవడం అర్దం అయ్యేలా చెప్పించాలి.  ఇలా అందరూ అర్దం చేసుకుంటూ , అడ్జస్ట్ అయితే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: