నిద్రలో మీకు ఇలాంటి కలలు వస్తున్నాయా ?

VAMSI
మాములుగా బాగా రోజంతా కష్టపడి అలసి పోయి ఘాడ నిద్రకు జారుకుంటూ ఉంటారు. అయితే ఇలా నిద్రపోతున్న సమయంలో చాలా మందికి తరచూ కలలు వస్తుంటాయి ఇది సర్వసాధారణం. కనే పెద్దలు చెబుతున్న ప్రకారం మనము ఏదైతే ఆలోచిస్తూ పడుకుంటామో అదే మన కలలోకి వస్తాయి. అయితే కల వచ్చే సమయాన్ని బట్టి కలలో కనిపించే సన్నివేశాలను బట్టి ఒక్కో కలకు ఒక్కో అర్దం చెప్పబడ్డాయి. అయితే చాలా మంది తమకు వచ్చిన కల భవిష్యత్తులో జరగబోయే ఏదో ఒక విషయం గురించే ముందుగా అందే ఒక సూచన అని భావిస్తారు.  అయితే వివిధ కలల యొక్క అర్ధాలను ఇపుడు తెలుసుకుందాం.
 
పితృదేవతలు ఏడుస్తున్నట్లు కలలో కనిపిస్తే : మన పూర్వీకులు చనిపోయి ఆత్మలుగా మారుతారు అన్నది ఒక నమ్మకం. అయితే కలలో కనుక మన పూర్వీకులు ఏడుస్తున్నట్లో లేక విచారంగా ఉన్నట్లు కనిపిస్తే, దానర్థం వారికి ఇంకా  మోక్షం లభించలేదు అని అనుకోవాలి. ఆ విషయాన్ని మీకు చెబుతున్నట్లు అట. అయితే అలాంటప్పుడు వారి ఆత్మకు శాంతి కలిగే కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి మోక్షం లభిస్తుందట. ఇలా మోక్షము కలిగిన పిమ్మట మళ్ళీ వారు మన కలలోకి రాకుండా ఉంటారని భోగట్టా.  
కాకిని కనుక కొడుతున్నట్లు  కనిపిస్తే: మీ పితృ దేవతలకు మీపై ఎందుకనో కోపంగా ఉన్నట్లు అర్దం. అయితే వారి కోపం తగ్గించడానికి కాకులకు అన్నం పెట్టాలట.
అలాగే కలలో కనుక పాము కరిచినట్లు కనిపిస్తే: మంచిదే కానీ అలా కనిపించినప్పుడు పుట్టకు వెళ్లి పాలు గుడ్లు సమర్పించి రావాలట.
ఇలా కలలో కనిపించే సన్నివేశాలను బట్టి ఒక్కో రకమైన అర్థాలు చెప్పబడ్డాయి. పగటి పూట వచ్చే కలలు చాలా వరకు నిజం అవుతాయి అని మరొక నమ్మకం. కానీ ఈ రకమైన వాటిని చాలా వరకు నమ్మరు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: