లైఫ్ స్టైల్: రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగాలి అంటే వీటిని తినాల్సిందే..!!

Divya
ఎర్ర రక్త కణాలలో మనకు ఎక్కువగా హిమోగ్లోబిన్ ఉంటుంది. అయితే ఇది ఎక్కువగా ఇనుము తో కలిసి ఉంటుంది. ముఖ్యంగా హిమోగ్లోబిన్.. ఊపిరితిత్తుల నుండి శరీర కణజాలానికి ఆక్సిజన్ మోసుకెళ్లే బాధ్యతను నిర్వర్తిస్తుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక శరీర కణజాలం నుండి సేకరించిన కార్బన్ డై యాక్సైడ్ ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. ఇక ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డై యాక్సైడ్ బయటకి వస్తుంది. ఇకపోతే ఫోలిక్ ఆమ్లం , విటమిన్ బి12, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం, ఇనుము వంటి పోషకాలు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ పోషకాలు తీసుకోవడం తగ్గిస్తామో.. అప్పుడు అలసటగా అనిపించడం,  మైకం, బలహీనత , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , తలనొప్పి,  చర్మం పలుచగా అవడం వంటి సమస్యలు ఏర్పడతాయి ఇలాంటి సమస్యలు ఏర్పడినప్పుడు ఎర్ర రక్తకణాల్లో హీమోగ్లోబిన్ స్థాయి తగ్గిందని గుర్తించాలి.
ఇక ఐరన్ రిచ్ వెజిటబుల్స్, పాలకూర, మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి వీటిని తినడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. ఇక బీట్రూటు ఐరన్ కి ఒక గొప్ప మూలం వంటిది. కాబట్టి ప్రతి రోజూ బీట్రూట్ ను సలాడ్లు, జ్యూస్, కూరలా చేసుకొని తినవచ్చు.  ముఖ్యంగా బీట్ రూట్ ను  ఒక తీపి వంటకం లాగ కూడా మీరు తయారు చేసుకొని తినవచ్చు.ఇక ఎలా తిన్నా సరే బీట్రూట్ ద్వారా లభించే అన్ని పోషకాలు కూడా మీకు లభిస్తాయి. వీటితోపాటు ఎర్రటి మాంసం, బీఫ్, మటన్, చికెన్ కాలేయం, బొప్పాయి, నారింజ ,స్ట్రాబెరి వంటి పండ్ల లో ఐరన్ లభిస్తుంది.  క్యాప్సికం, టమోటా, క్యాబేజీ ,పాలకూర వంటి వాటిలో కూడా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇక నల్ల ద్రాక్ష తినడం వల్ల  కూడా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: