అదే పనిగా ఫోన్ ను చూస్తున్నారా?.. తస్మాత్ జాగ్రత్త...

Satvika
ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.. టెక్నాలజీ పెరగడం తో చాలా మంది ఫొన్లకు బానిసలుగా మారుతున్నారు.. అలా ఎప్పుడూ అదే పనిలో ఉన్నా కూడా మంచిది కాదని నిపుణులు ఎంతగా చెప్పిన వినే పొజిషన్లో ఎవరూ లేరు..అందులో సోషల్ మీడియా వాడకం కూడా విపరీతంగా పెరిగి పోయింది.. దాంతో అందరూ ఈ ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. అయితే, అలా ఎక్కువగా ఫోన్లను పట్టు కోవడం మంచిది కాదు అని , అలా నిత్యం అదే పని లో వుంటే ఎన్నో సమస్యలు తలేత్తవచ్చునని అంటున్నారు. అవేమిటో ఇప్పుడు చుద్దాము..


స్మార్ట్ ఫోన్లు వచ్చాక చిన్నా-పెద్ద తేడా లేకుండా అందరూ అదే పనిగా ఫోన్ల కు అతుక్కుపోతున్నారు. స్క్రీన్ ను స్క్రోల్ చేస్తూ గంటల కొద్దీ ఫోన్ల లోనే గడిపేస్తున్నారు.. ఇలా అవ్వడం వల్ల ఆయుష్హు కూడా తగ్గిపోతుందని అంటున్నారు. దాని గురించి పూర్తీ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఫోన్ తమ జీవనశైలి లో భాగం చేసుకున్నవారు మొత్తం జీవితం లో 34 సంవత్సరా లకు సమానంగా స్క్రీన్ చూస్తూ గడుపుతారని అధ్యయనాలు చెప్తున్నాయి. దీని వల్ల ఫోన్ నుంచి ప్రసరితమయ్యే కాంతి మన కళ్ళ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు.


బక్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఏజింగ్ ఈగల పై ఒక ప్రయోగం చేసింది. దీని ద్వారా జీవుల కన్ను నేరుగానే మన ఆయుర్దాయాన్ని నియంత్రించగలదని చెప్తున్నారు పరిశోధకులు. కళ్ళకు హాని కలిగించే కాంతి పరోక్షం గా మనుషుల జీవిగడియారం పై ప్రభావితం చూపిస్తుందని అంటున్నారు. అందుకే రాత్రి సమయం లో కళ్ళకు ఎక్కువ కాంతి తగలడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అందుకే మన పెద్దలు చెప్పినట్లు, ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాలి.. చూసారుగా ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో ఇప్పటికైన ఫోన్లను కాస్త దూరం పెట్టండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: