లైఫ్ స్టైల్: రక్తదానం చేస్తే కాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చా..?

Divya
సాధారణంగా రక్తంలో ఐరన్ స్థాయిని తగ్గించడం వల్ల మనిషి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని..ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. అన్నిట్లో కన్నా రక్తదానం ఉత్తమం అని అంటూ ఉంటారు. ఇక పూర్తిగా ఇదే ఇప్పుడు నిజమైంది.. ముఖ్యంగా ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తికి రక్తదానం చేసే వారు చాలా తక్కువ మందే ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు.. రక్త దానం ఎందుకు చేయాలి..? దాని వల్ల కలిగే లాభాలు ఏమిటి..? అనే విషయాలను ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.
మీలో ఎవరైనా సరే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీ రక్తంతో ఇతరులకు సహాయం చేస్తున్నారని గుర్తుంచుకోవాలి. దానిలో ఉచిత హెల్త్ చెక్ అప్  కూడా వస్తుంది. కాబట్టి రక్తదానం చేసే ముందు సాధారణంగా రక్తాన్ని పరీక్షించి ఆ తర్వాత మీ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్,  రక్తపోటును, పల్స్ రేట్ ను  పరీక్షిస్తారు. ఇక ముఖ్యమైన సమాచారం ఏమిటంటే రెడ్క్రాస్ వంటి రక్తదాన కేంద్రాల ద్వారా వ్యక్తి ఆన్లైన్ ప్రొఫైల్ లో రికార్డు చేయడం జరుగుతుంది. ఇకపోతే పోతే మీరు మీ ఆరోగ్య పరిస్థితిని గురించి సులభంగా తెలుసుకోవచ్చు.
ఇక రక్త దానం చేయడం వల్ల.. ప్లేట్లెట్లు , ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా గా విభజించబడుతుంది. ఇకపై ఆస్పత్రిలో గుండాల తో పోరాడుతున్న వ్యక్తికి రక్తమార్పిడి చేయడం వల్ల వారు ప్రాణాలతో బయటపడతారు. ముఖ్యంగా రక్తదానం చేయడం వల్ల మీ శరీరంలోని ఐరన్ పరిమాణాన్ని తగ్గించవచ్చు. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.ముఖ్యంగా రోజురోజుకు ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మరెన్నో సమస్యలు వస్తాయి. కొందరిలో ఐరన్ లోపం  కూడా మరింత తీవ్రతరం అవుతుంది. ఇక మీ శరీరంలో కొత్త రక్తం రక్తం ఏర్పడటానికి దారితీస్తుంది. క్యాన్సర్ నివారణ కూడా జరగుతుంది. ఇకపోతే రక్తదానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గి పోయి, గుండె ప్రమాదాలు కూడా దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: