పురుషులు స్మార్ట్ గా కనిపించాలంటే ఇలా చేస్తే చాలు!

Purushottham Vinay
ఇక సాధారణంగా పురుషులు తమ చర్మంపై పెద్దగా శ్రద్ద చూపరు. అయితే వేసవిలో చర్మ సంరక్షణ అనేది ఎవ్వరికైనా కానీ చాలా ముఖ్యం. ఈ సమయంలో పురుషులు వారి చర్మంపై ఖచ్చితంగా ఎక్కువ శ్రద్ధ అనేది చూపించాలి.ప్రతిరోజూ కూడా నిద్రవేళకు ముందు ఖచ్చితంగా ముఖం కడుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ ని రుద్దండి. ఎందుకంటే ఇది మీ చర్మాన్ని త్వరగా పాడు చేయదు. ఇంకా గ్లో కూడా అలాగే ఉంటుంది.ఖచ్చితంగా రోజుకు రెండుసార్లు ముఖం కడగాలి. ఇంకా అలాగే వేసవిలో రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవడానికి ప్రయత్నించాలి. నిజానికి పురుషుల చర్మం చాలా జిడ్డుగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వారు ఖచ్చితంగా రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని సరిగ్గా కడుక్కోవడం వల్ల రంధ్రాలలో ఉండే మురికిని ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాకుండా చర్మంలో పేరుకుపోయిన అదనపు జిడ్డును కూడా ఈజీగా తొలగించుకోవచ్చు.ఇక ముఖం ఎలా శుభ్రం చేసుకోవాలంటే స్త్రీల కంటే పురుషుల చర్మం చాలా బిగుతుగా ఇంకా మందంగా ఉంటుంది. 


ఈ పరిస్థితిలో, పురుషులు ఖచ్చితంగా మరింత జాగ్రత్త వహించాలి. అలాగే ముఖాన్ని శుభ్రం చేయడానికి మంచి టోనర్ ని కూడా ఉపయోగించాలి. ఇది మీ చర్మ రంధ్రాలను శుభ్రంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా ఇది కాకుండా వేసవిలో ముఖాన్ని సహజంగా స్క్రబ్బింగ్ చేయడం కూడా చాలా అవసరం. దీంతో మృతకణాలు చాలా ఈజీగా బయటకు వస్తాయి. పురుషులు సాధారణంగా ప్రతి 3 రోజులకు ఒకసారి స్క్రబ్బింగ్ అనేది చేయాలి. ఇది మీ చర్మాన్ని బాగా మెరిసేలా చేస్తుంది.మాయిశ్చరైజర్ అనేది చాలా అవసరం. ఇక మీ చర్మాన్ని ఎల్లప్పుడూ కూడా మాయిశ్చరైజింగ్ చేస్తూ ఉండాలి.వేసవి కాలంలో తేలికపాటి మాయిశ్చరైజర్‌తో మీ చర్మం ఎల్లప్పుడూ కూడా చాలా బాగుంటుంది. ఇది చర్మంపై ముడతలు పడే అవకాశాలను కూడా తగ్గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: