లైఫ్ స్టైల్: ఈ కాయ తింటే అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు..!!

Divya
ప్రస్తుతం వేసవి కాలం తో పాటు అన్ని సీజన్లలో కూడా పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. ఏపీ చేత అయితే ఇది ఎక్కువగా ఉంటుంది కనుక మన శరీరాన్ని డీహైడ్రేట్ చేయనివ్వదు. పుచ్చకాయ తో పాటు దాని విత్తనాలు కూడా పలు రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఈ గింజలలో ఉంటాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్..K,C,E,A , జింక్, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు వల్ల మన శరీరం అనేక సమస్యలకు దూరమవుతుంది.

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది అట ఇది అధిక కేలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. అందుచేతనే పుచ్చకాయ తో పాటు వాటి విత్తనాలను కూడా మనం తినడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు. పుచ్చకాయ తినడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు చూద్దాం.
1). ఒక పుచ్చకాయలు సుమారుగా 150 గ్రాముల నిరు ఉంటుందట.. పుచ్చకాయ తినడం వల్ల జీర్ణక్రియకు చాలా మంచిది.. అంతే కాకుండా చర్మాన్ని రక్తప్రసరణను మెరుగుపరిచెలా చేస్తుంది.
2). పుచ్చకాయ బరువు తగ్గేందుకు కూడా మంచి గా సహాయపడుతుంది. మనం అల్పాహారంలో ఏ పుచ్చకాయ తీసుకోవడం వల్ల ఆ రోజంతా హైడ్రేట్ గానే శరీరం ఉంటుంది.
3). పుచ్చకాయలో పొటాషియం,క్యాల్షియం వంటివి బాగా ఉండటం వల్ల మన శరీరం నుండి విషాన్ని కూడా బయటకు పంపడంలో సహాయపడుతాయి.
4). రక్తంలో యూరిక్ యాసిడ్ పరిణామాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. దాని ద్వారా మూత్రపిండాల వ్యాధి నుంచి మనం బయట పడవచ్చు.
5). పుచ్చకాయలో ఎల్-సిట్రులైన్ ఉంటుంది. ఇది కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది శరీరం పనితీరును మెరుగుపరిచే ల కండరాలను బలంగా చేస్తుంది. అందుచేతనే వ్యాయామం చేసే ముందు పుచ్చకాయ రసం తాగడం చాలా మంచిది.
6). పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ ను తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: