లైఫ్ స్టైల్: మీ వంట గదిలో ఇవి ఉంటే.. డేంజర్ జోన్ లో పడ్డట్టే..!!

Divya
అత్యాధునిక పరిజ్ఞానం అనేది మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. కానీ దానిని కొంతవరకు మాత్రమే ఉపయోగించడం సరైనది. ఇక సాంకేతికత పై ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లు అయితే అనేక ప్రయోజనాల సంగతి పక్కన పెడితే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మన వంటగదిలో కనుక ఇలాంటివి ఉన్నట్లయితే తప్పకుండా మనం డేంజర్ జోన్లో పడ్డట్టే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే మనమందరం వాటిని ఉపయోగిస్తాము.. బహుశా అవి లేకుండా మనం జీవించలేము  అన్నట్టుగా ప్రపంచం మారిపోయింది. కానీ మనం వీటిని ఆపలేకపోతే కనీసం తక్కువగా వాడటం అలవాటు చేసుకోవాలి .మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రిఫ్రిజిరేటర్:
ప్రతి ఒక్కరి వంటగది లో అధికంగా ఉండే రిఫ్రిజిరేటర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది ఆహారాన్ని పాడవకుండా నివారిస్తుంది .ముఖ్యంగా చాలా కాలం పాటు వీటిని కొనసాగిస్తూనే ఉన్నాము .అయితే రిఫ్రిజిరేటర్ వల్ల మనిషికి వ్యాధులు రావడం మొదలవుతాయి. రిఫ్రిజిరేటర్లో క్లోరోఫ్లోరో కార్బన్ ఉండటం వల్ల అది మన శరీరానికి అత్యంత ప్రాణాంతకమైనది గా మారి ఆహారాన్ని కలుషితం చేస్తోంది.
మైక్రోవేవ్:
మైక్రోవేవ్ ప్రయోజనం ఏమిటంటే ఆహారం కేవలం కొన్ని క్షణాలలోనే వేడెక్కుతుంది .అయితే ఓవెన్ నుంచి వచ్చే రేడియేషన్ కూడా చాలా ప్రమాదకరమని నిరూపించబడింది. ముఖ్యంగా నేటి కాలంలో చాలామంది ఇంట్లో తప్పనిసరిగా ఒక భాగం అయిపోయింది ఇది. ఎంతలా అంటే చివరికి ఉదయం చేసిన అన్నం మొదలు ప్రతి ఒక్కటిని హిట్ చేయడానికి మైక్రోవేవ్ ను అధికంగా ఉపయోగిస్తున్నారు. మైక్రోవేవ్ లో వచ్చే వేడి మన ఆహారాన్ని విషంగా మారుస్తుంది.
ప్లాస్టిక్ సామాన్లు:
మన జీవితాన్ని చాలా సౌకర్యవంతంగా ప్లాస్టిక్ సామాన్లు చేస్తున్నాయి. ముఖ్యంగా ఏ వస్తువులు తయారు చేయాలన్నా కూడా ప్లాస్టిక్ సామాన్లను ఉపయోగిస్తున్నారు. ఇకపోతే ప్లాస్టిక్ సామాన్లు లను ఉపయోగించడం వల్ల శరీరానికి హానికరంగా మారుతుందని .. ముఖ్యంగా ప్లాస్టిక్ సామాన్లు వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్లాస్టిక్ సీసాలు,  పాత్రల వాడకాన్ని తగ్గించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: