వామ్మో లాప్టాప్ వాడకం వల్ల ఇన్ని అనర్ధాలా?

Purushottham Vinay
ఇక ల్యాప్‌టాప్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. రోజంతా కూడా ల్యాప్‌టాప్ ఉపయోగించడం వల్ల శరీరంపై చెడు ప్రభావం చూపుతోంది. ల్యాప్‌టాప్ నుంచి వెలువడే వేడి వల్ల చర్మం ఇంకా అలాగే అంతర్గత కణజాలం దెబ్బతింటున్నాయి. ల్యాప్‌టాప్‌ ఎక్కువ సేపు ఒడిలో పెట్టుకొని పని చేయడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు ఎక్కువగా ఏర్పడుతాయి. అలాగే అదే సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌కి రేడియేషన్‌కి సంబంధించినది కాబట్టి ల్యాప్‌టాప్ కంటే వైఫైకి కనెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతోంది. ఇక ల్యాప్‌టాప్‌ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసుకుందాం.పురుషులలో వంధ్యత్వం పెరుగుతుంది.ఈ ల్యాప్‌టాప్ వేడి మహిళల కంటే పురుషులకే ఎక్కువ హాని చేస్తుంది. ఇక దీనికి కారణం శరీర ఆకృతి. స్త్రీలలో గర్భాశయం అనేది శరీరం లోపల ఉంటుంది. పురుషులలో అయితే పునరుత్పత్తి అవయవాలు బయట ఉంటాయి. ఇక దీని కారణంగా రేడియేషన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మగవాళ్లు ల్యాప్‌టాప్‌లు వాడేటప్పుడు ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.


అధిక ఉష్ణోగ్రత కారణంగా స్పెర్మ్ నాణ్యత కూడా దెబ్బతింటుంది. కాబట్టి సంతానోత్పత్తిలో అనేక సమస్యలు ఏర్పడుతాయి.వైఫై ద్వారా రేడియేషన్ ఎక్కువ ఉంటుంది.ఇక ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకొని ఎక్కువసేపు పనిచేయడం కంటే ఇది ఇంకా చాలా డేంజర్. అలాగే తక్కువ ఫ్రీక్వెన్సీ రేడియేషన్ హార్డ్ డ్రైవ్ నుంచి విడుదలవుతుంది. ఇక ఇది చాలా ప్రమాదం. దీనివల్ల నిద్రలేమి ఇంకా అలాగే తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.కండరాల నొప్పులు ఎక్కువ వస్తాయి.ఇక ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచుకోవడానికి బదులుగా కొంతమంది టేబుల్‌పై పెట్టుకొని పనిచేస్తారు. దీని కారణంగా ల్యాప్‌టాప్ రేడియేషన్ అనేది నేరుగా శరీరంపై పడుతుంది. దీని నుంచి వెలువడే వేడి మిమ్మల్ని బాగా అనారోగ్యానికి గురి చేస్తుంది. అందుకే ల్యాప్‌టాప్‌ను నిరంతరం ఉపయోగించడం మానుకోండి. ఇది కండరాలలో బాగా నొప్పిని కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: