రావి చెట్టు : ఆస్తమా, లైంగిక సమస్యలు మాయం!

Purushottham Vinay
రావి చెట్టులో ఉండే చలువ చేసే గుణం చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో బాగా సహాయపడుతుంది. స్త్రీలలో వచ్చే యోని దోషాలను తొలగించడంలో ఇంకా అలాగే రక్తాన్ని శుద్ది చేయడంలో, వ్రణాలను తొలగించడంలో కూడా ఈ చెట్టు బాగా ఉపయోగపడుతుంది. రావి చెట్టు బెరడును నానబెట్టిన నీళ్లను కానీ ఇంకా బెరడుతో చేసిన కషాయాన్ని కానీ రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల సెగ రోగాలు, మూత్రంలో మంట ఇంకా అలాగే మూత్రాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి.అలాగే నడుము నొప్పితో బాధపడే వారు రావి చెట్టు బెరడును ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక టీ స్పూన్ చొప్పున ఒక కప్పు నీళ్లల్లో కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి ఈజీగా తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది. రావి చెట్టు బెరడును ఎండబెట్టి పొడిలా చేసి స్టోర్ చేసుకోవాలి. శరదృతువులో పౌర్ణమి రోజున ఆవుపాలు, బియ్యం ఇంకా అలాగే పంచదారతో పాయసాన్ని చేయాలి. 


ఈ పాయసాన్ని 100 గ్రా. ల మోతాదులో తీసుకుని అందులో 5 గ్రా. ల రావి చెట్టు బెరడు పొడిని కలిపి వెన్నెల తగిలేలా బాగా ఆరబెట్టాలి. ఈ పాయసాన్ని ఆస్తమా రోగికి ఇచ్చి రోగిని రాత్రంతా కూడా మెలుకువగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆస్తమా ఒక్క రోజులోనే నయం అవుతుందని కూడా చెబుతున్నారు.అలాగే వెక్కిళ్లను తగ్గించే గుణం కూడా రావి చెట్టుకు ఉంది. ఇక రావి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను తమలపాకులో వేసి చుట్టి దానిని తింటూ కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉండాలి.ఇక ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. రావి చెట్టు లేత ఆకులను తీసుకుని 4 లీటర్ల నీటిలో వేసి లీటర్ నీళ్లు అయ్యే దాకా మరిగించాలి. ఇందులో ఒక కిలో పంచదారను వేసి చిన్న మంటపై పాకం వచ్చే దాకా ఉడికించాలి. ఈ లేహ్యాన్ని రెండు పూటలా 10 గ్రా. ల చొప్పున తింటూ ఉండడం వల్ల స్త్రీ ఇంకా పురుషులిద్దరిలో శారీరక బలం పెరుగుతుంది. అలాగే లైంగిక సామర్థ్యం కూడా బాగా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: