లైఫ్ స్టైల్: నడక తర్వాత ఈ పనులు చేస్తున్నారా..?అయితే జాగ్రత్త..!!

Divya
నడక ఆరోగ్యానికి మంచిదే కానీ నడక తర్వాత మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాంతకం కూడా అవుతుంది. ఇక ప్రతి రోజు వాకింగ్ చేసిన తర్వాత వెంటనే ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. నిజానికి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు ఫిట్ గా ఉండడం కోసం వ్యాయామం, నడక, యోగ , రన్నింగ్ లాంటివి చేయడం తప్పనిసరి. నేటి వేగవంతమైన జీవనశైలిలో వ్యాయామానికి అత్యంత సమయాన్ని కేటాయించడం తప్పనిసరి. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మీరు ఈ విషయాలు తెలియకపోతే అనుకోకుండానే మీరు మీ ఆరోగ్యాన్ని కోల్పోతారు.
తరచుగా నడిచిన తర్వాత మీరు కొన్ని తప్పులు చేయడం మానుకోవాలి. నడక లేదా వ్యాయామం చేసిన తర్వాత చాలామంది నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఇలా అస్సలు చేయకండి. నడక లేదా వ్యాయామం చేసిన తర్వాత 20 నిమిషాల పాటు ఏమి తినకూడదు అలాగే తాగకూడదు.. అంతేకాదు వెంటనే పడుకోవద్దు కూడా. వ్యాయామాలు లేదా నడక చేసిన తర్వాత హృదయ స్పందన రేటు పెరిగి పోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచంపై పడుకోకండి . మీకు రిలాక్స్ కావాలంటే కొద్దిసేపు సోఫాలో కూర్చుంటే సరిపోతుంది.
ఎక్సర్సైజ్ , రన్నింగ్ లాంటివి చేసిన తర్వాత శరీరమంతా చెమటతో నిండి పోతుంది. వెంటనే మీరు బట్టలు మార్చుకోవడం తప్పని సరి. చెమట తో నిండిపోయిన బట్టలు ధరించడం వల్ల అలర్జీలు, దురద, ర్యాషేష్ వంటి సమస్యలు వస్తాయి. పరిగెత్తడం అయిన వెంటనే స్నానం చేయకూడదు. కొంత సమయం పాటు చెమట పొడిగా అయిన తర్వాత స్నానం చేసి  బయట వాతావరణంలో పదినిమిషాలపాటు కూర్చోవాలి .అంతే తప్ప ఏసీ , కూలర్ లాంటివి ఉపయోగించవద్దు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యం పదికాలాల పాటు పదిలంగా ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలను కూడా ప్రతి ఒక్కరికి మీరు తప్పకుండా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: