లైఫ్ స్టైల్: సబ్జా గింజలు తింటే సన్నబడతారు..?

Divya
ఒకప్పుడు ఒంట్లో వేడిగా అనిపించింది అంటే చాలు కొంతమంది సబ్జా గింజలు నీటిలో నానబెట్టుకుని చక్కెర వేసుకుని పానీయంగా తాగేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు అందరూ ఎక్కువగా పానీయాలకు బానిస కావడంతో అనేక సమస్యలు కూడా వెలువడుతున్నాయి. కానీ వైద్యులు మాత్రం సబ్జా గింజల ప్రయోజనాలను తెలియజేస్తూ ప్రజల దృష్టికి తీసుకు వెళుతున్నారు.
గతంలో వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరి ఇంట్లో సబ్జా గింజలు ఉండేవి. వీటిని మనం ఎక్కడికి ప్రయాణించినా కూడా అక్కడికి తీసుకువెళ్లి దాహం తీర్చుకోవచ్చు. అందుచేతనే వీటిని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఇందులో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. ఈ పోషకాల వల్ల బరువు తగ్గడం ప్రారంభించి శరీరంలో పోషకాహార లోపాలు అన్నింటిని కవర్ చేస్తూ ఉంటాయి. కొన్ని సబ్జా గింజలను తీసుకుని వాటిలో ఉండే రాళ్లను తీసివేసి మంచి నీటితో వాటిని శుభ్రం చేసి.. ఒక కప్పు తీసుకొని గోరువెచ్చని నీటిని పోసి నానబెడితే.. అలా నానబెట్టిన గింజలను నిమ్మకాయ నీటిలో కలుపుకొని మనం తాగవచ్చు. లేదంటే ఏదైనా పంచదార ద్వారా అయినా కలుపుకొని తీసుకోవచ్చు.
1). సబ్జా గింజలు నీటిని తాకగానే పది రెట్లు ఉబ్బుతాయి. వేసవికాలంలో తాపాన్ని తగ్గించుకోవడానికి ఇది చక్కటి పానీయంగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మన శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది.
2).తరచూ డీహైడ్రేషన్ కు గురయ్యే వారు ఈ సబ్జా గింజల పానీయాన్ని తాగినట్లయితే మన శరీరంలో ఉండే సమతుల్యంలో మార్పులు వస్తాయి.
3). సబ్జా గింజల పానీయం లో అల్లం రసం, కాస్త తేనె వేసుకొని తాగినట్లయితే శ్వాసకోశ వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు.
4). మహిళల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ఈ సబ్జా గింజలు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తాయి.
5). సబ్జా గింజల లో ఎక్కువగా పీచు పదార్థం ఉండడం వల్ల మన జీర్ణ సమస్యను నివారిస్తాయి. ప్రతిరోజూ పడుకునే ముందు కనీసం ఒక గ్లాస్ సబ్జా గింజలు తాగడం వల్ల చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: