వామ్మో : కేసీఆర్ రాక్స్ జ‌గ‌న్ షాక్స్

RATNA KISHORE
అభివృద్ధిలోనే కాదు ఇత‌రుల‌కు చేయూత ఇవ్వ‌డంలోనూ ఆంధ్రాతో పోటీప‌డుతున్నారు తెలంగాణ చంద్రుడు. త‌న వెలుగును పంచుతూ ఎంద‌రో జీవితాల్లో చీక‌ట్లు తొల‌గిస్తూ ప‌లువురికి స్ఫూర్తి అందిస్తున్నారు.ప్ర‌తిరోజూ ఎన్నో విన‌తులు వివిధ స‌మ‌స్య‌ల‌పై ఉండ‌వ‌చ్చు కానీ సీఎంఆర్ఎఫ్ త‌ర‌ఫున మాత్రం ఒక్క విన‌తి కూడా పెండింగ్ ఉంచేదుకు ఇష్ట‌ప‌డ‌రు ఆయ‌న‌.
కేసీఆర్ అనుకుంటే చేస్తారు
సాయం అంటే ముందుకు వ‌స్తారు
తెలంగాణ ముఖ్య‌మంత్రి దేశంలోనే
ఆదర్శంగా నిలిచిన వైనంతో
గులాబీ శ్రేణులు ఆనందంగా ఉన్నాయి

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రాతో ప్ర‌తి విష‌య‌మై పోటీ ప‌డుతున్నారు అన్న‌ది స‌త్యం. అవును ఆయ‌న మ‌న క‌న్నా వేగంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు అన్న‌ది కూడా నిజం.అదేవిధంగా త‌న రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంద‌రో అభాగ్యుల‌ను, బీద‌ల‌ను, మ‌ధ్య త‌రగ‌తి జీవుల‌ను ఆదుకున్నారు.అందుకే ఆయ‌న జ‌గ‌న్ క‌న్నా వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువ కాగ‌లుగుతున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి కూడా ఆయ‌న సాయం చేసి, వారి మ‌న్న‌న‌లు అందుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్ప‌టిదాకా రెండు వేల కోట్ల రూపాయ‌లు సాయం చేశారు.. నాలుగు ల‌క్ష‌ల మందిని ఆదుకున్నారు. జీవ‌న్మ‌ర‌ణ సంద‌ర్భాల్లో నేనున్నాన‌ని చాటి చెప్పారు. ఆయ‌న భోళా మ‌నిషి.. ఎదుటి క‌ష్టం అని తెలిస్తే చాలు వెంట‌నే స్పందించి త‌న‌వంతు సాయం చేసి పంపుతారు. త‌న ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏం చేయాలో చేశాక‌నే ఆయ‌న సంతృప్తి చెందుతారు.దటీజ్ కేసీఆర్.
అది ఆంధ్రా అయినా,తెలంగాణ అయినా మ‌నిషి క‌ష్టం క‌ష్ట‌మే! ఆప‌ద స‌మ‌యాల్లో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోని వేళల్లో కొన్నిసార్లు అయిన వారికి కూడా చేతిలో చిల్లిగ‌వ్వ లేక ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో స్పందించ‌డ‌మే మాన‌వత్వం. అలాంటి వేళల్లో కేసీఆర్ స్పందించారు. త‌న‌దైన సాయం ఒక‌టి చేసి అంద‌రి మ‌న్న‌న‌లూ అందుకుంటున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రం క‌న్నాఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ విడుద‌ల చేసిన మొత్త‌మే చాలా అంటే చాలా ఎక్కువ.ఈ విష‌య‌మై కేసీఆర్ ను అభినందించాలి. అంతేకాదు ఆయ‌న చేసిన సాయం మ‌రిచిపోకూడ‌దు కూడా! అటు ఆంధ్రావాళ్ల‌యినా ఇటు తెలంగాణ వాళ్ల‌యినా!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: