డయాబెటిస్: ఈసమస్యల గురించి కూడా తెలుసుకోవాల్సిందే..?

Divya
డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధి అని మనం చెప్పకనే చెప్పవచ్చు.. ఒకసారి డయాబెటిస్ వచ్చింది అంటే జీవితాంతం మనం శరీరంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే.. నిత్యం మందులతో కాలం గడపాల్సి ఉంటుంది. తినే ఆహారం మొదలుకొని.. గడిపే జీవనశైలి వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.. ముఖ్యంగా ఎవరికైతే డయాబెటిస్ ఉంటుందో వారి మెడికల్ చెక్ లిస్ట్ కూడా చాలా పొడవు గానే ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే...
ఇక డయాబెటిస్ వచ్చినప్పుడు ప్రతి రోజూ మనం షుగర్ స్థాయిని చెక్ చేసుకోవడం.. భోజనంలో కార్బోహైడ్రేట్లను లెక్క పెట్టుకోవడం.. గ్లూకోస్ మానిటర్ చేసుకోవడం.. మందులు తీసుకోవడం.. రక్తపోటు చూసుకుంటూ ఉండటం.. లాంటివి ఒక జాబితాను మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది.. ముఖ్యంగా కంటి చూపు పోవడానికి కూడా డయాబెటిస్ సమస్య కారణమని తాజాగా వైద్యులు తెలిపారు.. అయితే ఇందులో భయాందోళనలు చెందాల్సిన అవసరం ఏమీ లేదు.. కానీ డయాబెటిస్ వచ్చిన వారికి చూపు మందగిస్తుంది అని అందుకు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని.. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే కష్టపడాల్సిన అవసరం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు..
డయాబెటిస్ వచ్చినప్పుడు రోజూ వారి చెక్ లిస్ట్ పాటిస్తూనే కంటి వైద్యుడిని కూడా కలవాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కంటి పరీక్ష కొరకు మీరు ఒక రోజున కేటాయించుకుని కంటి వైద్యులకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.. కన్నుకు రక్షణగా కార్నియా పొర ఉంటుంది.. కాబట్టి దీనిని రక్షిస్తూనే కాంతిని కూడా ఫోకస్ చేయాలి.. కంటి సమస్యలు ఎక్కువగా ఎవరికి వస్తాయి అంటే చాలా కాలంగా డయాబెటిస్ సమస్య ఉన్న వారికి , ధూమపానం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో షుగర్ స్థాయి సరైన నియంత్రణ లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవారికి కంటి చూపు మందగించే ప్రమాదం ఉంటుంది .. కాబట్టి చికిత్స విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ వల్ల వచ్చే అంధత్వాన్ని నియంత్రించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: