లైఫ్ స్టైల్: వంటింట్లో దొరికే వీటిని మగవారు తింటే ఇక అంతే..?

Divya
సాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మన వంట ఇల్లు ఔషధాలకు పుట్టిల్లు అని.. అయితే మనం వంటల్లో వాడే గసగసాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. వాటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం మగవారికి తీరని నష్టం వాటిల్లుతుందట. ఇకపోతే ఈ గసగసాలను ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు.. కానీ అప్పట్లో అయితే వీటిని ఎక్కువగా మందుల తయారీలలో మాత్రమే వాడేవాళ్ళు. ఇకపోతే అమ్మమ్మల కాలంలో ఈ గసగసాలను బొబ్బట్లు, అరిసెలు మీద ఉపయోగించే వాళ్లు. ఇకపోతే వీటితో కలిగే ప్రయోజనాలు తెలియక చాలా మంది ఇతర మసాలా ఐటమ్స్ ను కొనుక్కుంటారు.. కానీ దీనిని కొనడానికి చాలామంది ఇష్టపడక పోగా వీటిని తినడానికి కూడా దూరంగా ఉంటారు..
ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ గసగసాలు వెయ్యకపోతే కూర టేస్ట్ కూడా అంతగా బాగుండదు అంటూ విరివిగా ఉపయోగిస్తున్నారు.. కూరలకు ఎంత రుచిని అందిస్తాయో కూర్మా లాంటి వాటిలో కూడా వీటిని వేయడం వల్ల ప్రత్యేక రుచి, కమ్మదనం వంటివి కూడా వస్తాయి.. అంతేకాదు ప్రతిదీ కూడా ఈ మధ్య కాలంలో పొడుల రూపంలో వస్తున్నాయి.. కానీ గసగసాలు మాత్రం మనకు పొడుల రూపంలో కాకుండా ఎలా ఉంటే అలాగే వాటిని మనకు మార్కెట్లో అమ్ముతున్నారు.. ఇక పోతే గసగసాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా మనం తెలుసుకుందాం..
కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి.. ముఖ్యంగా వీటిలో ఉండే ఆక్సలేట్లు.. క్యాల్షియం ను గ్రహించి కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి.. ఇక అంతే కాకుండా మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. బాగా నిద్రపోయేందుకు గసగసాలను ప్రతిరోజూ పడుకునే ముందర పాలలో కలుపుకొని తాగితే బాగా నిద్ర పడుతుందట. ఇక శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.. గుండె నొప్పి  కూడా మటుమాయమవుతుంది. ఇక కడుపులో మంట, ఎసిడిటి, అల్సర్ లు, పుండ్లు వంటి వాటిని కూడా దూరం చేసుకోవచ్చు.. మగవారు మాత్రం వీటిని ఎక్కువగా వాడడం వల్ల మంచిది కాదు అని స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని,  లైంగిక సామర్థ్యము కూడా దెబ్బ తింటుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: