దేవుడా ఆ గుంటూరోడు : చేబ్రోలు బ్రో ఏం చేశాడో తెలుసా! వింటే ఆశ్చర్యమే

RATNA KISHORE
సంక్రాంతి అంటే పందెం కోళ్లు
వాటికి మార్కెట్లో ఉన్న విలువ
ల‌క్ష‌ల్లో ప‌లికిన సందర్భాలూ ఉన్నాయి..
ఈ పాయింట్నే ఆయ‌న తీసుకుని
త‌న స‌క్సెస్ స్టోరీ రాసుకున్నారు
ఆచ‌రించి న‌లుగురికీ ఆద‌ర్శం అయ్యారు
శ్ర‌వ‌ణ్ కుమార్...


దేశీయ జాతుల కోళ్ల పెంపకం అన్న‌ది ఆశించినంత అనుకున్నంత సులువు కాదు కానీ ఆ కుర్రాడు సాధించాడు. ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి కార‌ణంగా ఎంద‌రినో ప్ర‌భావితం చేసే ఫ‌లితాలు ఇవాళ వ‌స్తున్నాయి. ఘ‌ట్ట‌మ‌నేని ఫామ్స్ పేరుతో న‌డుస్తున్న ఈ సంస్థ‌కు ఉన్న విశేషాలు ఎన్నో! గ్రామీణ వాతావ‌ర‌ణంలో వ‌స్తున్న విప్ల‌వాత్మ‌క మార్పున‌కు తార్కాణాలూ ఎన్నో!


ఊరికి వ‌చ్చాక ఉన్న ఉపాధి మాత్ర‌మే ఎల్ల‌కాలం అన్నం పెట్ట‌దు. వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం అన్న‌ది జీవితాల‌ను పూర్తిగా మార్చివేసింది. మోతాదుకు మించిన ప‌ని కార‌ణంగా అస్స‌లు ఓ సందిగ్ధావ‌స్థ‌లో ఉద్యోగులు ఉండేలా చేస్తుంది. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు ప‌ని ఒత్తిడీ పెరిగిపోయింది. ఉన్న ప‌నిని వ‌దులుకోకుండా ప్ర‌త్యామ్నాయ ఆదాయ మార్గాల‌పై దృష్టి సారించే విధంగా ప్ర‌య‌త్నాలు ఆరంభిస్తే ఇత‌రుల క‌న్నాభిన్నంగా నిల‌బ‌డ‌వ‌చ్చు.ఆ విధంగా ఎవ‌రికి వారు త‌మ‌ని తాము నిరూపించుకోవాలంటే ముఖ్యంగా మార్రెట్ ను పూర్తిగా అధ్య‌యనం చేసి, అటుపై పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి వ‌హించాలి. ఈ కుర్రాడి సీక్రెట్ ఆఫ్ స‌క్సెస్ కూడా అదే!


ఉపాధి మార్గాలు రాన్రూనూ పెరిగిపోతున్నా యువత మాత్రం అందుకు త‌గ్గ అవ‌కాశాలు వెతుక్కోలేక‌పోతున్నాయి.ఆ విధంగా వెనుకంజ‌లో ఉండిపోతున్నాయి. ఆ విధంగా కాకుండా మంచి ఫ‌లితాలు సాధించేందుకు ఉన్న వ‌న‌రుల‌ను వెతుక్కుని వాటిని ప్ర‌స్తుత మార్కెట్ కు అనుగుణంగా మ‌లుచుకుంటే ల‌క్ష‌ల్లో లాభాలు ఆర్జించ‌వ‌చ్చు. కేవలం సంపాద‌నే కాదు న‌లుగురికీ ఉపాధి క‌ల్ప‌న కూడా చేయ‌వచ్చు. లోక‌ల్ ఎంట‌ర్ప్రెన్యూర్ గా మారి మంచి పేరు తెచ్చుకోవ‌చ్చు.. ఇవ‌న్నీ ఓ కుర్రాడు చేశాడు. దేశీయ జాతి కోళ్ల పెంపకంపై పూర్తిగా దృష్టి సారించిన ఆ కుర్రాడు పేరుకు సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన‌వాడే అయినా, త‌న‌కున్న కొద్ది పాటి ఖాళీ స‌మ‌యంలో ఈ రంగంపై మ‌న‌సు ల‌గ్నం చేశాడు.దీంతో ఇప్పుడ‌త‌ను మంచి లాభాలే కాదు గుంటూరు, ప్రకాశం జిల్లాల‌లో దేశీయ జాతి కోళ్ల పెంపకంలో అందెవేసిన చేయిగా నిలిచాడు.


అంద‌రిలా డబ్బులు సంపాదించాల‌న్న ఆలోచ‌న  నుంచి వినూత్నంగా అందరి క‌న్నా భిన్నంగా డ‌బ్బులు ఎలా సంపాదించాల‌న్న వ్యూహ‌మే గొప్ప‌ది.అదే ప‌నిగా డ‌బ్బులు దాచుకోవ‌డం క‌న్నా దాచుకున్న డ‌బ్బుల‌తో పెట్టుబ‌డు పెట్టి మంచి లాభాలు అందుకోవ‌డం కూడా ఓ ముఖ్య విష‌య‌మే! గుంటూరు జిల్లా, చేబ్రోలు మండ‌లం, వ‌డ్ల‌మూడి గ్రామానికి చెందిన శ్రావ‌ణ్ కుమార్ ఇలానే త‌న‌దైన మార్గంలో వెళ్లాడు. ఘ‌ట్ట‌మ‌నేని ఫామ్స్ ఏర్పాటు చేసి స‌త్తా చాటుతున్నాడు.యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: