హ్యాపీ సంక్రాంతి : సెల‌వుల‌తో జాగ్ర‌త్త!

RATNA KISHORE

పండుగ‌కు ఊరొస్తుంటే అమ్మమ్మ ఎదురొస్తుంది..తీయ‌టి క‌థ‌లు వెన్నెల వేళ‌ల్లో చెప్పిన సంద‌ర్భాల్లో  అమ్మ‌మ్మ న‌వ్వులు గుర్తుకు వ‌స్తాయి.. చంద్రుళ్లో ఉండే కుందేలు గుర్తుకు వ‌చ్చి చ‌క్కిలిగిలి పెడుతుంది. ధ‌నుర్మాస పొద్దుల్లో చ‌లిమంట‌లు గుర్తుకువ‌స్తాయి..భోగీ క‌న్నా ముందు గుర్తుకు వ‌చ్చే దొంగ భోగీ ఒక‌టి గుర్తుకు వ‌స్తుంది.. ఊరుకు వెళ్తే బావి దగ్గ‌ర నీటి గొడ‌వ‌లు అల్ల‌రి చేస్తాయి.. ప‌ల‌క‌రించే దారులు కొన్ని మ‌న త‌ప్పిదాల‌ను గుర్తు చేస్తాయి.. ఇన్నీచేశాకే సంక్రాంతి ఇవ‌న్నీ లేకుండా పండుగ ఎలా అవుతుంది స‌ర్.. కాదండి.. అది పండుగే కాదు.. మీ మీ పేకాట‌లు, కోడి పందేలు వ‌దిలి ఇటు చూస్తే అసలు పండుగ మ‌న జీవితంలో ఉంది. మ‌న చుట్టూ ఉన్న ప‌రిస‌రాల్లో ఉంది. బిడ్డ‌ల ఎదుగుద‌ల‌కు కార‌ణం అయిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఉంది.. కనుక పెద్దాళ్లూ సంక్రాంతి వేళ సెల‌వులతో జాగ్ర‌త్త! విలువైన‌వి పొంది విలువ‌లేని వదిలేయండి ఏం కాదు...
సంక్రాంతి పండుగ‌కు ఊళ్లోకి వ‌స్తున్న పిల్ల‌ల‌కు,పెద్ద‌ల‌కు జాగ్ర‌త్త‌లు చెబుతూ హెరాల్డ్ మీడియా రాస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది.ఊరికి వ‌చ్చారు స‌రే! మీరు జాగ్ర‌త్త‌గా ఉన్నారా? ఊరికి వ‌చ్చారు స‌రే! మీ పిల్ల‌లు ఆటల వెనుక మీరున్నారా? ఊరికి వ‌చ్చారు స‌రే! వారి ఆనందాల్లో మీరున్నారు స‌రే! ఈత స‌ర‌దాల్లో మీరెందుకు వెన్నంటే ఉండ‌లేక‌పోతున్నారు? ఊరికివ‌చ్చారు స‌రే పేకాట‌లో మునిగిపోతే మ‌రి! ప‌ల్లెను, పెద్దాళ్ల‌ను ఎవ‌రు ప‌ట్టించుకుంటారు?

ఇవ‌న్నీ ఆలోచించి ఊళ్లో గ‌డ‌పండి.. ఏడాదికోసారి ఊరిని గుర్తు చేసుకోవ‌డంలో ఉండే ఆనందం ద‌గ్గ‌ర మ‌నమంతా చిన్న‌వారం..నేల‌ను ముద్దాడి,ఊరి దారుల్లో న‌డుస్తుంటే ఆ సంతోష‌మే వేరు. మీరు మీ ఊరిని ప్రేమించండి.. మీ మ‌నుషుల‌ను ప్రేమించండి.. సెల‌వులు క‌దా! మీ బిడ్డ‌ల‌కు కొన్ని నీతి క‌థ‌లు చెప్పి పంపండి త‌ప్పేం కాదు..అవే ముఖ్యం.. మీరు పేకాట‌లోనూ,తాగుడుతోనూ కాలం గ‌డిపి పిచ్చి పిచ్చి గంతులు వేసే క‌న్నా మీ బిడ్డ‌ల‌కు మంచి మంచి జ్ఞాప‌కాలు అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ పిల్ల‌లు మీ క‌ల‌ల‌కు రూపాలు అని అంటారు క‌దా క‌నుక ఆ క‌ల‌ల‌ను మ‌రింత జాగ్ర‌త్త‌గా ఎద‌గ‌నివ్వండి.ఆ కల ఆ కాలం చేజార‌నివ్వ‌కండి.. పెద్దాళ్లూ మీరు క‌ల‌ల‌తో జాగ్ర‌త్త..మీ మీ ఊహ‌ల‌తో జాగ్ర‌త్త.ఇది క‌దా కావాలి!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: