మార్నింగ్ రాగా : మళ్లీ మా ఊరిలోనే మా సంక్రాంతి

RATNA KISHORE
సంక్రాంతికి మా ఊరు
మా జ్ఞాపకం రెండూ
ఏ విధంగా ఉంటాయి
మ‌నుషుల్లో  వారి ప్ర‌వ‌ర్త‌నల్లో
పొంద‌నివి ఈ సంక్రాంతి
యాడ నుంచి తెస్తుంద‌ని !
కనుక కాంతి విషాదాంతం కాదు
ఓ ప్రారంభ వీచిక కూడా!
అదొక దుఃఖానికి విరుగుడు
కొన్నిసార్లు ..

 

రంగుల కాగితంపై ఎన్ని జ్ఞాప‌కాలు ఛిద్రం అయి ఉన్నాయో! నేను ఆగిపోయాను.వీధికి సంస్కృతి తెలియ‌దు..సంఘం అత్యంత హీనంగా ఉంటుంది.దేశం..దౌర్భాగ్యం అన్నీ అన్నీ ఒకే విధంగా ఉండి ఉంటాయి..అయినా కూడా  జీవితం ఒక కొత్త వేకువను ఆహ్వానించి ఉంటుంది..అటువంటి సంద‌ర్భంలో మాత్ర‌మే రంగుల కాగితంపై అముద్రిత జ్ఞాపకం ఈ సంక్రాంతి.
దారంతా కొన్ని అసంద‌ర్భాలు..జీవితం చిన్న‌బోతుంది..మ‌నిషి వెలిగిపోవడం జ‌ర‌గ‌ని ప‌ని! అప్పుడో ఎప్పుడో గుర్తుకువ‌చ్చే కాంతి నీలోలేదు..నీది కాదు..అప్పుడ‌యినా ఇప్పుడ‌యినా గెలిచే ప‌ల్లెను చూస్తే నాకు ముచ్చ‌ట.. మురికి దేహానికి ఉంద‌ని న‌వ్వి ఊరుకున్నాను..మ‌నుషులు మురికి మ‌నుషులు క‌దా! అప్పుడు బాహ్యం అని తోచిన‌వ‌న్నీ మురికిమ‌యాలే అని న‌వ్వుకుని పోయాను..తిరునాళ్ల‌లాంటి ఈ వేళ‌లో వీధిలో ఆంజనేయుడు ఎదురొస్తాడు..సీత‌మ్మ ముగ్గులు దాటి ఇంటి ముంద‌ర‌కు వ‌స్తుంది.. రామ‌య్య కు నేను చేయ‌ద‌గ్గ విన్నపం ఏదీ లేదు. సంక్రాంతి అంటే  కొన్ని సంయుగ్మ రేఖ‌ల ఆన‌వాలు ..

 
కాంతికి అనువ‌ర్త‌నం ఆపాదించుకుని చేసుకునే పండుగ.. మ‌నిషిలో ప్ర‌తిరోజూ ఉండే చెడు ఆ ఒక్క‌రోజే తొల‌గిపోవ‌డం సాధ్యం కాద‌ని గుర్తిస్తే చాలు ఏడాదంతా పండుగే! క‌నుక ఇప్పుడు చెడు నిర్మూల‌న కాదు క‌దా క‌నీస గుర్తింపున‌కు కూడా నోచుకుని లేదు. ఆ విధంగా సంక్రాంతి కొత్త వెలుగులు మోసుకు రాక ఎక్క‌డో ఆగిపోయింది.


వీధంతా న‌డిస్తే కొన్ని సంద‌ర్భాలు గుర్తుకు వ‌స్తాయి.. వీధి వెంట న‌డిస్తే నీడ‌లు న‌డుస్తున్నాయి మ‌నుషులు లేరు. చుక్క‌న‌డిగా దిక్కున‌డిగా అని క‌వి నివ్వెర‌పోతాడు నాలో! ఆ క‌వి పేరు వేటూరి.మ‌రి! నీరు పొంగిన క‌ళ్ల ఎదుట నిలిచిన కాంతులు గొప్ప‌వి! లేదా వాటికి కార‌ణం అయిన మ‌నుషులు గొప్ప‌వారు..అవును! కాంతిని వ‌ద్ద‌నుకుని నిరాశ‌ను పోగేసుకుని ప్ర‌మాణీక‌రించే మ‌నుషుల్లో సంక్రాంతి మార్పు తీసుకు  రాదు..క‌నుక ఈ పండుగ నిత్యం అయిన విష‌యాల‌కు ఆన‌వాలు.. స‌త్య సంధాన‌త అన్న‌ది మ‌నిషిలో ఉంటే వ‌చ్చే మేలుకొలుపు గొప్ప మార్పున‌కు ప్ర‌తీక.


మ‌నుషులంతా ధనుర్మాసపు మేలుకొలుపునకు ప్ర‌తినిధులు అయి ఉంటారు.మ‌నుషులంతా సంక్రాంతి ముగ్గుల్లో చుక్క‌లు మాదిరి ఉంటారు.చుక్క‌లూ దిక్కులూ క‌లిపి మ‌నిషి అయి ఉంటాడు.దిక్కులూ ఆకాశం క‌లిపి మ‌న‌సు అయి ఉంటుంది. చుక్క‌లూ మ‌గువ‌లూ క‌లిపి హృద‌యం అయి ఉంటుంది. హృద‌యానికి మాత్ర‌మే తెలిసిన గొప్ప విజ్ఞ‌త మీలో నాలో కొలువుండి పోతుంది.దేవుడ్ని ప్రార్థిస్తే మ‌నిషి ఎదురొస్తాడు..మెతుకుల‌ను స్మ‌రిస్తే అమ్మ ఎదురొస్తుంది..మెతుకుల‌కూ అమ్మ‌కూ మ‌ధ్య దేవుడు ఈ పండుగ వేళ‌ల్లో నాలో! మ‌రియు మీలో!
మాటల్లో ఏమ‌యినా మురిపాలు ఉన్నాయా అని ఓ పాట గాడు అడుగుతున్నాడు.. న‌వ్వుకున్నాను..మాట మురిపెం మాత్ర‌మే కాదు ఆలోచ‌న‌కు సంబంధించిన ఓ స‌మీరం కూడా! మీ సంద‌ళ్లలో మీ వేడుక‌ల్లో ప‌ల‌క‌రించే ఆత్మికం మ‌నిషి అని గుర్తించాలి.. బ‌జారులోఅతి పెద్ద షాపింగ్ మాల్స్ ముందు మ‌నుషులు ఉంటారు.. వాళ్లే సిస‌లు మ‌నుషులు. పాత త‌రం మనుషులు.. పాపం ఆ కాగితం పంకా లెక్క తేల‌దు.. సంగీతం వినిపించే వేణువు వేడుకుంటుంది.. మ‌న‌లాంటి వారికి త‌న లాంటి వారికి మ‌ధ్య వార‌థి ఎవ‌రయి ఉంటారు..  హృద‌యానికి మాత్ర‌మే తెలిసిన మాట.. ఈ వేడుకకు హృద‌యం ఒక్క‌టే కాదు దేహ సంబంధం అయిన జ్ఞానం మాత్ర‌మే కాదు ఇంకా ఇత‌రేత‌ర పోగేసుకున్న జ్ఞానం కూడా ఇత‌రులకు ఉప‌యోగ‌పడితే చాలు..

 - ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: