లైఫ్ స్టైల్:వ్యాయామం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Divya
ఉదయం లేవగానే ఎంతో హడావిడి గా మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాము.. ఎందుకంటే మనం ఏదైనా పని కి వెళ్లడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తూ ఉంటాము. ఒకవేళ సాయంత్రం వేళలో మనకి అనుకూలంగా ఉంటే వ్యాయామం చేయడం మంచిది అని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా వీటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లుగా నిపుణులు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం.
1).ఉదయం పూట మనం జాగింగ్ చేసినట్లు అయితే మన శరీరంలో ఉండే కండరాలు, శరీరం వేడెక్కడం తో పాటుగా ఆ వేడి వల్ల గాయాలు కూడా త్వరగా మానే అవకాశం ఉంటుందట.అంతేకాకుండా శరీరంలో ఉండే రక్తం కూడా బాగా సరఫరా అవుతుందని చెప్పవచ్చు.
2). మనం ఏదైనా ఒత్తిడిలో ఉంటే వాటిని తగ్గించుకోవడానికి సాయంత్రం వేళ వ్యాయామం చేసినట్లయితే ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుందట. అంతేకాకుండా మానసిక ఉల్లాసాన్ని కూడా ఇస్తుందట.
3). సాయంత్రం వేళ వ్యాయామం చేస్తే మంచి నిద్రతో పాటు, మరుసటి రోజు ఉదయం లేవగానే ఎంతో తాజా అనుభూతిని కూడా పొందవచ్చు.
4). ఒక వ్యక్తి ఏదైనా పనిలో నిరుత్సాహ పడి ఆందోళన పడుతూ ఉంటే దాని నుంచి ఉపశమనం కలగడానికి సాయంత్రం వేల జాగింగ్ వంటివి చేయడం వల్ల ఇలాంటి ఉపయోగం కలుగుతుంది. ఇక అంతే కాకుండా రక్తప్రసరణ కూడా చాలా మెరుగుపడుతుందని ఆరోగ్య వైద్యులు తెలియజేస్తున్నారు.
5). ఉదయం లేవగానే బిజీ లైఫ్ తో ఉండే వారు కాస్త తమ సమయాన్ని ఇలాంటి వ్యాయామం సమయానికి కాస్త కేటాయించినట్లు అయితే.. రాబోయే రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యల వలన ఇబ్బంది పడకుండా ఉంటారు.
ఇలాంటివి ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవడం వల్ల.. వారికి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి.. అందుచేతనే మన ఇంట్లో ఉండే పిల్లలకు కూడా ఇలాంటి అలవాటు నేర్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: