సింగ‌ర్ సునీత : ఆ పెళ్లిలో విశేషం ఏమీ లేద్సార్? అంతా సామాన్య‌మే!

RATNA KISHORE

పెళ్లి గురించి రాస్తుంటే  విషాద సంద‌ర్భాలేవో గుర్తుకు వ‌స్తున్నాయి
అమ్మానాన్నా ఓ విషాద
సంద‌ర్భం అయితే
అప్పుడు మాత్రమే
బిడ్డ‌ల‌కు  శోకం అంతిమం అవుతుంది
ఇప్పుడు చెప్పండి మీ చుట్టూ
ఉన్న‌వారిలో
మీరు పంచిన మంచి ఎంత‌?
మీరు పంచ‌ని చెడు ఎంత?

ప్రేమ అయినా పెళ్లి అయినా సంస్కృతి లోగిళ్ల‌లో వేడుక.సంప్ర‌దాయ వేడుక‌ల్లో వ‌సంత గీతిక..వింటున్న వాటిలో మంచికి .. విననంత వ‌ర‌కూ చెడుకు ద‌గ్గ‌ర‌గా ఉండడ‌మే మేలు.విన‌నివి కొన్ని వినిపించుకోనివి కొన్ని ఉండాలి అని చ‌దివేను. చెవిటి మేళం అని అంటారు క‌దా! త‌ప్పేం కాదు. చెవిటిత‌నం కొన్ని సార్లు మేలు చేస్తుంద‌ని ఓ ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత చెప్ప‌గా విన్నాను.. క‌నుక భ‌గ‌వంతుడి సృష్టిలో విన‌కూడనివి మీ చెవికి మీ కంటికి చేర‌కుండా ఉంటే చాలు.. ఉన్న జీవితం అంతా ఆనందాల‌కు ఆన‌వాలు అయి ఉంటుంది.హ్యాపీ మార్నింగ్ టు ఆల్...
ఇన్నాళ్లుగా శ్ర‌మియించిన ఇల్లాలిని..ఇక పూజించ‌నీ..ప‌రిపాలించ‌నీ.. అని ఓ పాట ఉంది..వింటూ వింటూ  ప‌దం మార్చి పాడుతున్నాను.లోకంలో మ‌న‌కు సంబంధం లేనివి,మ‌న బాధ్య‌త‌కు అంద‌నివి ఎక్కువ‌గా మ‌న అన‌వ‌స‌ర విష‌యాల్లో ఉంటాయి..వాటిని విని చూసి న‌వ్వుకోవ‌డం త‌ప్ప ఏమీ ఉండదు.. సింగ‌ర్ సునీత పెళ్లికి మ‌న జీవితాల‌కు ఏమ‌న్నా సంబంధం ఉందా కానీ మ‌నం అన్నింటిపై మాట్లాడిన విధంగా ఆమె చేసుకున్న (మ్యాంగో రామ్)  పెళ్లి గురించి మాత్రం మాట‌లు చెబుతాం.. కొన్ని విమ‌ర్శ‌లు చేస్తాం..అవ‌న్నీ మ‌న హ‌క్కు అని భావిస్తాం..ఆమె కేవ‌లం పాట‌లు మాత్ర‌మే పాడారండి మ‌నం మాత్రం ఆమె జీవితాంతం వెన్నంటే ఉండే భ‌జ‌న గీతాలు కానీ వైరాగ్య గీతాలు కానీ విమ‌ర్శా గీతాలు  కానీ పాడ‌క్క‌ర్లేదు..ఆ ప‌ని మ‌న‌ది కాదు.క‌నుక నో మీన్స్ నో .. వ‌ద్దు అంటే వ‌ద్దు అనే అర్థం క‌దండి..కానీ మ‌నం అలా ఉంటున్నామా.. ఉండము.. ఉండ‌లేము ఉండ‌కూడ‌దు కూడా!
 
ఏడాది ఆ పెళ్లికి
అన‌గా గ‌త ఏడాది జ‌న‌వ‌రి 9 న వారు ఒక్క‌ట‌య్యారు..అన‌గా నిన్న‌టితో ఏడాది.. ఈ ఏడాది వైవాహిక జీవితం గురించి కానీ ప్రొఫెష‌నల్ లైఫ్ గురించి కానీ మ‌నం మాట్లాడుకోవాల్సిన ప‌ని మ‌న‌కు లేదు కానీ అదే పనిగా మీడియా రాస్తుంటుంది.. రామ్ ఎవ‌రో తెలుసా.. రామ్ కూ సునీత‌కూ ప్రేమ ఎలానో తెలుసా..అని..న‌వ్వుకుంటాను నేను..వారి జీవితాల‌లో ఆ లోగిళ్ళ‌కు పోయి మాట్లాడ‌డంతో ఔన్న‌త్యం క‌న్నా అర్థం క‌న్నా చెడిన భావం ఏదో ఒక‌టి ఉంది అని! క‌నుక మ‌నుషుల్లో నిర్ణ‌యాత్మ‌క‌త మంచిది కానీ న్యాయ సూత్రాల‌ను పాటిస్తూ నిర్ణ‌యాత్మ‌క‌త చేయ‌డం స‌హేతుకం..అదే ధ‌ర్మం కూడా! ధ‌ర్మాన్ని అన్నివేళ‌లా పాటించ‌డ‌మే భార‌తీయ‌త బోధించే సారం.. వైవాహిక బంధంలో ధ‌ర్మ సూత్ర‌త ఉంది క‌దా! దానిని మాత్ర‌మే గౌర‌వించి మిగ‌తా విష‌యాలు హాయిగా వదిలేయండి.. ఏం కాదు అదే మీ బాధ్య‌త కావాలి.. యుక్తి కి సంబంధించిన ప్రామాణిక రీతి కూడా కావాలి. ఇప్పుడు చెప్పండి  మీ చుట్టూ ఉన్న‌వారిని ఎలా అర్థం చేసు కుంటున్నారు? ఈ ఉద‌యం ఈ ఒక్క ప్ర‌శ్న ద‌గ్గ‌రా ఆగిపోండి ఏం కాదు.
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: