హ్యాపీ సండే : డ‌బ్బులు ఊరికే రావు..వీకెండ్ డైలాగ్

RATNA KISHORE

 ప్రేమ బంగారం..మ‌న‌సు బంగారం..జీవితాన ప‌ల‌క‌రించే ప్ర‌తి కాంతీ స్వ‌ర్ణ శోభితం.
ఆ గుండు మ‌నిషి మా ఊరికి వ‌చ్చాడు..రావ‌డం రావ‌డంతోనే చాలా సంచ‌లనాలే న‌మోదు చేశాడు.బంగారం లాంటి మ‌నిషి..బంగారం లాంటి వ్యాపారం..కాదు బంగార‌మే ప్ర‌ధాన వ‌స్తువుగా  చేసుకుని చేసే వ్యాపారం.డ‌బ్బులు ఊరికే రావు అని చెప్పే గుండు బాస్ ఇప్పుడు మ‌ళ్లీ మా ఊరికి వ‌స్తే బాగుంటుంది.ల‌లితా జ్యూయ‌ల‌ర్స్ మా ఊరికి వ‌చ్చింది.ఏడాది పూర్త‌యింది.నేటితో ఏడాది పూర్త‌యింది.ల‌లితా జ్యూయ‌ల‌ర్స్ రాక కార‌ణంగానే స్థానిక వ్యాపారం చాలా మందికి ప‌డిపోయింది.అటుపై మ‌రో జ్యూయ‌ల‌రీ షాపు వ‌చ్చి ల‌లితాకు పోటీగా నిలిచింది. పేరు జీఎన్ జ్యూయ‌ల‌ర్స్..వ్యాపారి,వ్యాపారి కొట్టుకుంటే ఏమ‌యింది..బంగారం,బంగారం రాజుకుంటే ఏమౌతుంది..ఏదో ఒక‌టి అవుతుంది కానీ ఇప్పుడు బంగారం ఏ ధ‌ర‌లో ఉంది ఏ వాల్యూని పోగేసుకుంది అన్న‌ది కాకుండా మ‌నుషులంతా బంగారాలేనా అన్న డౌట్ ద‌గ్గ‌ర ఆగిపోయాను ఈ వారాంతాన.

మ‌నుషులు బంగారాలు మ‌నుషులు వ‌జ్రాలు మ‌నుషులు ర‌త్నాలు ఇలాంటి పోలిక‌లు విని న‌వ్వుకుంటాను. డ‌బ్బులు ఊరికే రావు అని ఎలా అంటారో అలానే మ‌న అనుకునే మ‌నుషులు కూడా ఊరికే రారు.అందుకు త‌గ్గ మంచి త‌నం మ‌న ద‌గ్గ‌ర ఉండాలి.అందుకు త‌గ్గ ప్ర‌య‌త్నం కూడా మ‌న‌లోనే ఉండాలి.ఇవేవీ లేకుండా వ్యాపారం బంగారం నిల‌బ‌డ‌వు.బంగారం అంటే విలువ‌కు అతీతం అయి ఉంటుందా..మ‌ట్టి బంగారం అయితే నేల తన విలువ‌ను లోకానికి ప్ర‌క‌టించ‌కుండా ఉంటుందా..మ‌నుషులు గోల్డ్ అంటే గోల్డ్ అన్న విధంగానే..ఉన్నారా..గోల్డ్ అంటే ఏద‌యినా న‌కిలీకి ఆన‌వాలు అనేలా ఉన్నారా?డ‌బ్బులు ఎలా వ‌స్తాయి శ‌రీర క‌ష్టం నుంచి సిరులు ఎలా ఉత్ప‌త్తి అవుతాయి..బంగారం ఉత్ప‌త్తి కేంద్రానికి కొన‌సాగింపు బంగారం మేలిమి త‌నానికి సంకేత రూపం బంగారం ఒక దేశం ఆస్తి లేదా ఒక సామాన్యుడి స్థోమ‌త‌కు నిలువెత్తు సంత‌కం బంగారం అంటే ఎవ‌రు?త‌మ కోసం తాము అనే వారు బంగార‌మా?బంగారం అంటే మీరే అన్నారొక‌రు న‌వ్వేన్నేను! ప్రేమ బంగారం..మ‌న‌సు బంగారం..జీవితాన ప‌ల‌క‌రించే ప్ర‌తి కాంతీ స్వ‌ర్ణ శోభితం.
డ‌బ్బుల‌న్నీ ఉత్ప‌త్తి కేంద్రాల‌ను నిర్దేశిస్తాయి..జీవితాలు స్వేద వేదాల నుంచి కొత్త నిర్వ‌చ‌నాలు అందుకుంటాయి..బంగారం దేశాల మార‌క ద్ర‌వ్య‌నిధిని నిర్ణ‌యిస్తుంది అని విన్నాను.నిధి ఎలా ఉన్నా ఒక జీవితం ఒక సంస్కృతి ప‌ర‌స్ప‌ర ఆధారితం అయ్యాక..బంగారం త‌న విలువ‌ను శాస‌నంగా మారుస్తుంది.త‌న గుర్తింపును గౌర‌వంగా స్వీక‌రిస్తుంది..బంగారం అతివ నుంచి అతివ వ‌ర‌కూ ఆనందాల‌కు నెల‌వు అయి ఉంటుంది..మన పండుగ‌ల‌కో మ‌న జాత‌ర వేళ‌ల‌కో అవి ఇంకొంత వెలుగులు ప్ర‌సాదిస్తాయ‌ని కొంద‌రి న‌మ్మిక..ఇంతకీ న‌వ్వు దీపావ‌ళి అవుతుందా.. న‌వ్వు దీపావ‌ళే కాదు సంక్రాంతి కూడా! కూడా అన్నానంటే ఆ కూడ‌లిలో ఉన్నాన‌నే! బంగారం జీవితాల‌ను మ‌రింత మార్చాల‌న్న‌ది ఒకింత ఆశ కొంద‌రిది..కొంద‌రికి  కూడా! కానీ మ‌న మ‌నసుల్లో వెలిగే తేజం బంగారం కాన‌ప్పుడు జీవితం బంగారుమ‌యం ఎందుకు కావాలి? అన్న ప్ర‌శ్న ద‌గ్గ‌ర వారాంతాన ఆగిపోయాను. హ్యాపీ సండే టు ఆల్..  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: