వామ్మో: క్లాత్ మాస్క్ తో 20 నిమిషాల్లోనే కొవిడ్..!!

Divya
కరోనా మహమ్మారి 2 వేవ్ లుగా అందరి జీవితాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు మూడవ సారి ఒమిక్రాన్ వేరియంట్ గా మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.. తాజాగా క్లాత్ మాస్క్ వర్సెస్ N95 మాస్క్ వివాదం మళ్లీ తెరపైకి రావడం గమనార్హం. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత చాలా మంది ప్రజలు తమ ముఖాలకు క్లాత్ మాస్కులతో కవర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈక్రమంలోనే N95 మాస్క్ వాడాలా క్లాత్ మాస్క్ వాడాలా అని సందిగ్ధంలో ఉన్నారు ప్రజలు.
N95 మాస్క్ ఉపయోగించడం వల్ల ఈ చలికాలంలో శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది వాదించారు..ఇక అందుకే తాజాగా జరిపిన పరిశోధనల ప్రకారం క్లాత్ మాస్క్ ఉపయోగించడం వల్ల కేవలం 20 నిమిషాల్లోనే కొవిడ్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే పరిశోధనలు ఏం చెబుతున్నాయి అంటే N95 మాస్కులు ధరించడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వచ్చినప్పటికీ కరోనా నుంచీ  90% సురక్షితంగా ఉండవచ్చు అని చెబుతున్నాయి.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈ వ్యాధి సోకిన వ్యక్తి మాస్కులు లేకుండా ఉంటే అతడికి సుమారుగా ఆరు అడుగుల దూరంలో మాస్క్ లేని ఆరోగ్యకరమైన వ్యక్తి ఉన్నప్పటికీ 15 నిమిషాల్లోనే కరోనా బారిన పడవచ్చు. క్లాత్ మాస్కు ధరించినట్లయితే 28 నిమిషాలలో కరోనా బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన వారు మాస్కులు ధరించకుండా క్లాత్ మాస్కులు ధరించి నట్లయితే ఇతరులకు సోకే ప్రమాదాన్ని 20 నిమిషాలకు తగ్గించవచ్చు.. ఇకపోతే N95  మాస్కులు ధరించి నట్లయితే కరోనా సోకిన వారికి ఆరడుగుల దూరం ఉన్నట్లయితే కరోనా ఇతరులకు వ్యాపించడానికి ఇరవై ఐదు గంటల సమయం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు N95 మాస్క్ లు  ధరించాలని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: