లైఫ్ స్టైల్: మనీ ప్లాంట్ ఇంట్లో వుంటే ఆర్థిక ఇబ్బందులు ఉండవా..?

Divya
పాత పద్ధతులు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే..అది ఏదైనా కావచ్చు ఫ్యాషన్ విషయంలో అయినా కావచ్చు అలాగే ఫర్నిచర్, సంగీతం, ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి.. అంతేకాదు ఇంటి కోసం వాస్తు నివారణలు అన్నీ కూడా తిరిగి వచ్చాయని చెప్పవచ్చు. మనం చేసే ప్రతి పనికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యతలు కూడా బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వివాహ ముహూర్తాలు నుండి గృహప్రవేశాలు వరకు ఇంటీరియర్ డెకరేషన్ నుండి ఇంట్లో ఫర్నిచర్ ను నిర్ణయించడం వరకు ప్రతి ఒక్కరిని ప్రస్తుతం మళ్లీ ఆచరిస్తున్నారు..
దేశంలో ఎనిమిది ప్రధాన నగరాలలో నిర్వహించిన ఒక అధ్యయనంలో 90 శాతానికి పైగా గృహ కొనుగోలుదారులు వాస్తు కంప్లైంట్ లేని ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారని తేలింది. ఇదిలా ఉండగా చాలామంది చైనీస్ వాస్తును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చైనీస్ వాస్తు ప్రకారం ఇంటి ఎంట్రెన్స్ డోర్ కు కానీ లేదా కర్టెన్ రంగు ఎరుపు రంగు కొద్దిగా ఉంటే కచ్చితంగా ఇంటిలోకి ధనం ఎక్కువగా వస్తుందట. చైనీస్ శాస్త్ర ప్రకారం ఇంట్లో ఆరెంజ్ పళ్ళు ఉండడం వల్ల శుభకరం అని వారు నమ్ముతారు.. కాబట్టి ప్రతి రోజూ ప్రతి ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద ఆరంజ్ పండ్లు పెట్టుకోవడం శుభకరం అని వారు నమ్ముతారు.
ఇకపోతే ఇళ్లల్లో మనీ ప్లాంట్ పెట్టుకోవడం వల్ల చాలా అదృష్టం ఉంటుందని నమ్ముతారు. వారు తెలిపిన ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే కచ్చితంగా అదృష్టం కలిసివస్తుంది. చైనీస్ శాస్త్రం ప్రకారం చిన్న పాత్రలో నీళ్ళు పోసి అందులో పువ్వులు వేసి అలంకరించడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ ఇంట్లోకి వ్యాపిస్తాయి. ఇంట్లో పెద్ద ఆకులు వున్న మొక్కలు పెంచుకోవడం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ రావడంతోపాటు చేసే ఉపాధిలో అభివృద్ధి జరుగుతుంది. భోజనాల గది పశ్చిమానికి ఎదురుగా ఉండాలి. ఎందుకంటే శని చేత పాలించబడింది..ఆకలితో ఉన్న వారికి ప్రాతినిధ్యం వహించే బకాసుర మార్గాన్ని సూచిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: