మార్నింగ్ రాగా : ప్రేమ ప్ర‌త్యేకం అవుతుందా? "అక్ష‌ర" గానాన

RATNA KISHORE
భాగ్య న‌గ‌రి దారుల్లో ప్రేమ
రాచ‌న‌గ‌రి వీధుల్లో ప్రేమ
మినారు ప్రేమ మినియేచ‌రు ప్రేమ
సంవిధాన ధోర‌ణి ప్రేమ
శోష‌ణ ధార‌ణ అన్నీ కూడా ప్రేమ అయి ఉన్నాయి నాలో!
ఉద‌యాన సంచరిచే స్వ‌రాల కేళీ చెంత
అక్ష‌ర గానం ఈ మార్నింగ్ రాగా...

మ‌నుషులంతా ఒక్క‌టే అన్న శాస్త్ర‌మో,శాస‌న‌మో ఇవాళ ఇబ్బంది పెడుతున్న ప్ర‌శ్న..ఆ విధంగా లేన‌ప్పుడు ప్రేమ ప్ర‌త్యేకం కాదు సామాన్య‌మే..సామాన్యం అయిన ప్రేమ‌కు గొప్ప క‌థ‌ల సృష్టి సాధ్యం కాదు.ఎవ‌రు ఎవ‌రిని అర్థం చేసుకుంటున్నారు అన్న ఒక చిన్న గీతను విస్తృతం చేస్తే ప్రేమ వాక్యార్థం అయి ఉంటుంది..వ‌చ‌నార్థం కూడా అయి ఉంటుంది.ఈ పాటి కూడా ఆలోచించ‌కుండా మ‌నుషులు త‌మ అంత‌ర్మ‌థ‌నాల‌కు అక్ష రూపం ఇవ్వ‌డం ఓ ప‌నికి మాలిన త‌ర్జుమా రీతి...నేను వాటిని ప‌ట్టిం చుకోను.అందుకే అంటాను ఏం రాస్తున్నార్రా?అని!ఈ ఉద‌యం నా స్నేహితుడు అక్ష‌ర..పుట్టిన్రోజు..శుభాకాంక్ష‌లు అన్నా! మమ్మల్ని ప్రేమించే శ‌క్తికి వంద‌నాలు చెల్లిస్తూ..రాస్తున్నానొక మార్నింగ్ రాగా..
య‌క్ష గానం కిన్నెర గానం ఉంది..ఈ అక్ష‌ర గానం ఏంటి..అక్ష‌ర జ్ఞానం అని రాయాలి క‌దా! నీవు త‌ప్పు రాశావా ర‌త్నా! నీవు తప్పు చెప్పావా కిశోరా!లేదండి క‌రెక్టుగానే రాశాను.నేనెందుకు త‌ప్పు రాస్తాను.త‌ప్పు ప‌ల‌క‌ను..రాయ‌ను.. న‌డ‌వను..న‌డిపించ‌ను కూడా! మ‌రి? జీవ‌ధారల చెంత మ‌నిషి మ‌రొక‌రి ఆత్మ ల‌క్ష‌ణ రీతిని అర్థం చేసుకుని చేసే ఏ గొప్ప ప్ర‌తిపాద‌నా లేనప్పుడు కాంక్ష‌ల‌న్నీ త‌ప్పక స్వేచ్ఛాల‌య‌కు అడ్డుంకులే! అని చెబుతూ అక్ష‌ర గానం చేశాను  నేను..ప్రారంభ రేఖ విస్మ‌య చింత నాలో! విస్తృతార్థం తూగేక నేనొక స్వేచ్ఛకు అనున‌య రీతిని అనుస్వరాన్ని అని కూడా అంటాను నేను..

 ఒక పాట రాసి పాడుతూ ఉన్నాను..పాట గ‌మ‌న రీతి నిర్దేశించి రాశాను.ఆ పాట‌ను ఆల‌పిస్తున్న‌ప్పుడు ఒక‌టే మాట చెప్పారొక‌రు.రు కాదు డు.వాడే అక్ష‌ర..అసిస్టెంట్ డైరెక్ట‌రు అక్ష‌ర అని రాయాలి నేను.వేణు ఊడుగుల(విరాట ప‌ర్వం ఫేం)అసిస్టెంట్ డైరెక్ట‌రు అని రాయాలి నేను.సొంత నేల క‌థ‌ల మీద విప‌రీతం అయిన ప్రేమ,అభిమానం ప్ర‌క‌టించే మ‌నుషులు కొంద‌రే ఉంటారు.ప్ర‌తిభ‌కుస్వయంకృషిని జోడించి ప‌నిచేయ‌డంలో ఆనందం ఉంది అని కొంద‌రే అంటారు.వేణు,అక్ష‌ర వీళ్లిద్ద‌రూ నా దోస్తుల్రా! ఒరేయ్!
ఎక్కడున్నావ్ అనేంత చ‌నువు ఒక్క వేణు అన్న‌కే ఇచ్చాన్రా!వీళ్లిద్ద‌రూ నేనేం రాసినా శ్ర‌ద్ధ‌తో చ‌దువుతారు. ఒక్క‌టే అంటారు..నువ్వేం రాసినా ప్ర‌వాహ ధ‌ర్మం వీడ‌వు..మ‌ట్టి మ‌నిషి..త‌త్వం..తార్కికం..జ్ఞానం ఇవ‌న్నీ నీతో పెన‌వేసుకున్నాయి.అవును! నాకు విభేదం ఉన్నా ప‌ట్టించుకోను.రాసే ధ‌ర్మం ఒక‌టి ప్ర‌త్యేక రీతి అని అంటాడు వేణు..డు కాదు రు.. అని అంటాడు అక్ష‌ర డు ను మ‌ళ్లీ రు అని రాయ‌క్క‌ర్లే!


మేం అంతా ఒకే ప‌ద్ధ‌తిలో ఉంటాం..ఒకే ప‌ద్ధ‌తిని ప్రేమించి ఉంటాం.మ‌నుషులు వారి దారులు ఇవ‌న్నీ వేర్వేరుగా ఉన్నా కూడా! ఏకీభావంలో ఉండే ఒక ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం చెప్పి ప్ర‌యాణిస్తాం.వేణు,అక్ష‌ర,నేను అనే ఈ ముగ్గురి ప్ర‌యాణం వేర్వేరు కాదు! ప్రాసంగిక ధోర‌ణి వేరు కావొచ్చు అని అంటున్నాను నేను.మ‌నుషుల్లో ఇంగితం లేన‌ప్పుడు ఈస‌డించుకుంటూ పోతాను.వేగంగా రాయ‌డంలో ఉన్న గెలుపును ప్రేమిస్తూ పోతాను నేను..ఆహా! మెట్రో దారుల చెంత నేను..న‌ల్ల‌జ‌ర్ల రోడ్డు ద‌గ్గ‌ర నేను.. నల్లపోచ‌మ్మ గుడి ద‌గ్గర నేను..అక్ష‌ర న‌వ్వులోనూ..ఆయ‌న ఎలుగెత్తే ఆకాంక్ష‌ల కూడిక‌ల్లోనూ నేనే..తెలంగాణ వాకిట త‌ల్లుల‌కు వంద‌నాలు చెప్ప‌కుండా ఉండలేను..నా ప్రాంత బిడ్డ‌ల‌కు అన్యాయం అయితే త‌ప్ప‌క స్పందించే నేను..ఆ నేను ఈ నేను అంతా నేనే..అవున్రా! రాత అంతా నా చుట్టూ తిప్పుతాను...అదొక మంచి ప‌ద్ధ‌తి...దారి త‌ప్పిన భావ‌న‌ల్లో మ‌నుషులు ఉంటూ శీతాకాలం క‌థ‌లు,వేసవి కాలం చెమ‌ట్లు అని సోదంతా రాస్తారేంట్రా?నోర్మూయండ్రా మీరూ..మీ రాత‌లు..బాగా ఆలోచించాక పుట్టిన వాక్యంలో మీరున్నారో లేదో వెతుక్కోండి చాలు...శ‌వ సాహిత్య సాన్నిహిత్యంలో మీరుంటూ ఊరేగింపున‌కు తోడు రమ్మంటే నేనెందుకు వ‌స్తాను?త‌ప్పు! ఆ ప‌ని నేను చే య‌ను మీరూ చేయ‌కండి!అక్ష‌ర..మంచి సాహిత్యం ప్రేమిస్తాడు..ర‌వీంద్ర భార‌తి వీధుల్లో న‌డ‌యాడి వేడి వేడి ఛాయ్ పొగ‌ల్లో న‌వ్వులు క‌లిపి కాన‌గ‌వ‌స్తాడు...వేణూ అన్న వాడికి తోడు..నేను వాడికి తోడు..ఈ శ్రీ‌కాకుళం కూడా వాడికి తోడు...ల‌వ్ యూ అన్నా ప్రేమ ప్ర‌త్యేకం అయి ఉందా? మ‌ళ్లీ చెప్ప‌వ‌య్యా! హ్యాపీ బ‌ర్త్ డే అన్నా..


- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: