మీరు కొనే ఆ దుస్తులు భద్రమేనా

 గుంటూరు నగరానికి చెందిన లక్ష్మీ అనే మహిళా విజయవాడలో ఉన్న ఒక  షాపింగ్ మాల్ లో 40 వేల రూపాయల ఖరీదైన పట్టు చీరను కొనుగోలు చేసింది. అయితే అది రెండు వారాలకే పట్టు కోల్పోయింది. నగరంలోనే ఉన్న  వస్త్ర దుకాణం లో ఒక కుటుంబం మొత్తం ఖరీదైన పట్టు వస్త్రాలు తీసుకుంది. అవి కాస్త 3 వారాలకే ఆ వస్త్రాల నుంచి  పట్టు దారాలు విడిపోవడంతో  అవాక్కుయ్యారు. వీరే కాదు, ఇలా ఎంతోమంది ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. 

ప్రజలు ఎంతో ఇష్టపడే పట్టు వస్త్రాలు  పడవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?నాణ్యమైన పట్టును గుర్తించి పట్టు వస్త్రాలను కొనుగోలు చేయడం, వాటిని తగిన జాగ్రత్తలతో భద్రపరచడమే దీనికి ఏకైక పరిష్కారం.

అసలైన పట్టు దారం ఎలా ఉంటుంది ? 

అసలైన పట్టు దారాల్లో యానిమల్ ఫైబర్, ప్లాంట్ ఫైబర్ , మ్యాన్ మెడ్  ఫైబర్ , మినరల్ (ఆస్బెస్టాస్) ఫైబర్ వంటి పలు రకాలు ఉంటాయి. 

యానిమల్, ప్లాంట్ దారాలను సహజ ఫైబర్ మిగిలిన వాటిని సింథటిక్ ఫైబర్ గా పరిగణిస్తారు. యానిమల్ ఫైబర్ జుట్టు , ఊలు మాదిరిగా ఉంటుంది. దీన్ని కాలిస్తే ఒక రకమైన జుట్టు కాలిన వాసన వస్తుంది. గుండ్రంగా పూసలా మారి పొడిగా తయారవుతుంది. వస్త్రం చివర్లోని పట్టు పోగులను కాల్చి , ఈ పట్టును నిర్ధారించుకోవచ్చు. 

సింథటిక్ ఫైబర్ రకాలైన పాలిస్టర్, నైలాన్, రేయాన్ ల దారమైతే త్వరగా కాలిపోతుంది. ఈ రకం  దారాలు కాలిపోయిన తర్వాత పూసలా గట్టిగా తయారవుతుంది. 

పట్టు వస్త్రాల తయారీలో వినియోగించే దారాలు, రంగులు,  డిజైన్స్ ను బట్టి ధర నిర్ణయిస్తారు. అసలైన పట్టు వస్త్రాలలో పట్టు బంగారంలా మెరుస్తూ కనువిందు చేస్తుంది. ఆ దుస్తుల పై ఎలాంటి గీతలు ఉండవు 

పట్టు వస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకొని, వదిలే గుణాలు కలిగి ఉంటాయి.వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే రంగు పోతుంది. శుభ్రతకు గోరు వెచ్చని మంచినీరు మాత్రమే వినియోగించాలి. సబ్బు , డిటర్జెంట్స్ వీలైనంత తక్కువ గా వాడాలి. రంగుల చీరలైతే అంచును నీళ్లలో తడిపి , చేతితో రుద్ది రంగు పోతుందో లేదో పరిశీలించాలి. 10 చుక్కల నిమ్మకాయ రసం వేసి , దానిలో చీరను ఉంచి వెంటనే ఉతకాలి. 

పట్టు వస్త్రాలను ఉతికిన తర్వాత గట్టిగా పిండకుండా , జాడించకుండా నీడలో అరేయాలి. తేమగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేస్తే వేడి ప్రభావం దుస్తుల పై పడదు. ఇస్త్రీ చేసిన తర్వాత మడతలు వేసి బీరువాలో భద్రపరిచే సమయంలో కలరా ఉండలు కాకుండా చందనపు ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచాలి. దీనివల్ల తేమ చెరకుండా ఉంటుంది. మడతలు ప్రతి రెండు నెలలకు ఒకసారైనా మార్చాలి. ఇలా చేయడం ద్వారా పట్టు వస్త్రాలు తొందరగా పడవకుండా భద్రంగా ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: