హ్యాపీ సండే : భార్యా బాధితుల గోడు వినండహే! క్యాలెండ‌ర్ క‌హానీ!

RATNA KISHORE
మ‌గాళ్ల కోస‌మే క‌విత్వం రాశాడు అరుణ్ సాగ‌ర్..మేల్ ఛావ‌నిజం అని రాశాడు.. న‌వ్వుకున్నాను.. ఆడాళ్ల కోసం బాధ‌ప‌డ్డాడు సిస‌లు మ‌గాడు చ‌లం..కానీ  ఇరు వ‌ర్గాల బాధ‌లూ రాస్తాండు ఈ ర‌త్న‌కిశోరుడు...
అద్దాల మేడ‌ల్లో ఉండేటి మారాణుల గురించి రాసి రాసి విసిగిన క‌వుల‌కు ఓ విన్న‌పం..అప్పుడ‌ప్పుడూ మాలాంటి వారి గురించి రాయండి ఏం కాదు అని అంటున్నారు పాపం భార్యా బాధితులు..వారి హ‌క్కుల కోసం ఈ వారాంతంలో నిన‌దిస్తాను..త‌రువాత వారి బాధ్య‌త‌లేంటో త‌ప్ప‌క చెబుతాను..రాస్తున్నానొక వీకెండ్ విండో...
మా రాజు విజీన‌గ‌రం రాజు ప‌తంజ‌లి అనే క‌వి మ‌రియు ర‌చ‌యిత చెప్పిన విధంగా...ఆడ‌దానికి మ‌గాడి కాప‌లా అవ‌స‌ర‌మో లేదో తెలియ‌దు కానీ మ‌గాడికి మగాడి సాయం అవ‌స‌రం అని చాటి చెబుతున్న భార్యా బాధితుల‌ సంఘానికి ఈ వీకెండ్ నేను మ‌ద్ద‌తిస్తున్నాను.ఆనందిస్తూ,అభినందిస్తూ తోటి మగాళ్ల‌కు అండ‌గా ఉంటూ హ‌క్కుల కోసం చేసే పోరాటంలో భాగం అవుతాను ఇక‌పై...! మ‌రో విష‌యం ఏంటంటే ఒంట‌రి మ‌హిళ‌ల‌కు ప్ర‌భుత్వం పింఛ‌ను ఇస్తుంది..ఆదుకుంటుంది..కానీ ఒంట‌రి పురుషులను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు,వారి క‌ష్టాల‌ను,శ‌రీర బాధ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు అని ఇటీవ‌ల ఓ చోట చ‌దివేను. మ‌రి! వాళ్ల సంగ‌తో!

సూర్యాపేట‌కు చెందిన రాయిరాల సుమ‌న్ అనే సామాజిక కార్య‌క‌ర్త ఒంటరి మ‌హిళ‌ల‌కు ఇస్తున్న‌విధంగానే విడాకుల అనంతరం ఒంట‌రి అయిపోయిన పురుషుల‌కూ పింఛ‌న్లు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఎంత మంచి వార్త! హ‌క్కులు అటు ఇటూ రెండు వ‌ర్గాల‌కూ చెందేవే అయి ఉండాలి..స‌మాన‌త్వం అన్నంత పెద్ద ప‌దం వాడ‌ను కానీ వ‌స్తే మంచిది.ఈక్వాలిటీ,ఈక్విలిబ్రియ‌మ్ అన్న‌వి ఏ స‌మాజానికి అయినా,ఏ స‌మూహానికి అయినా,ఏ రెండు స్థితులు మ‌ధ్య అయినా అవ‌స‌రం క‌దా!క‌నుక వాటినే నేను న‌మ్ముతాను పాటిస్తాను. లేకుంటే ప్ర‌శ్నిస్తాను..మ‌గాళ్ల కోస‌మే క‌విత్వం రాశాడు అరుణ్ సాగ‌ర్..మేల్ ఛావ‌నిజం అని రాశాడు.. న‌వ్వుకున్నాను..ఆడాళ్ల కోసం బాధ‌ప‌డ్డాడు సిస‌లు మ‌గాడు చ‌లం..కానీ ఇరు వ‌ర్గాల బాధ‌లూ రాస్తాండు
ఈ ర‌త్న‌కిశోరుడు...

కృష్ణా..గోదావ‌రి జిల్లాలు చాలా మంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి..వారిని అభినందించ‌కుండా ఉండ‌లేం. ఎందుకంటే భార్యా బాధితుల సంఘం పేరిట కృష్ణా జిల్లా,నందిగామ‌లో ఓ ఆఫీసే ఏర్పాటు అయితే, మ‌రో చోట భార్యా బాధితుల సంఘం పేరిట తాడేప‌ల్లి గూడెంలో ఏకంగా కార్య‌క‌లాపాలే నిర్వ‌హిస్తూ,బాధిత పురుషుల త‌ర‌ఫున అండ‌గా నిలుస్తూ,సాంత్వ‌న ఇవ్వ‌డం మంచి విష‌యం..ఈ రెండు జిల్లాల‌కూ ఈ ఉద‌యం మ‌నం అంతా అన‌గా మ‌గాళ్లంతా ఓసారి థాంక్స్ చెప్పుకోవాలి..ఆడాళ్ల‌కు దిశ అనే యాప్ ఇచ్చారు జ‌గ‌న్ స‌ర్..(అది యాక్ట్ కాదు యాప్‌) కానీ మ‌గాళ్ల‌కో ! దేవుడా ఏంటీ వివ‌క్ష?

స‌మాజంలో అన్ని స‌మ‌స్య‌లూ మ‌గాడి వ‌ల్లే వస్తున్నాయ‌ని అదే ప‌నిగా ఆడిపోసుకోవ‌డం ఆడాళ్ల వంతు! అందుకే ఆడాళ్లా నాకొద్దు నా ద‌గ్గ‌ర ప‌ని చేయ‌లేరు అని అంటాడు కృష్ణ వంశీ! స‌వాల‌క్ష సాకులు చెప్పి హింసించే ఆడవాళ్ల‌ను వ‌ద్ద‌నుకోవ‌డంలో త‌ప్పేం లేదు..న‌వ్వుకునేందుకు అనుకున్నా అటు ఆడాళ్ల‌లో అయినా ఇటు మ‌గాళ్ల‌లో అయినా వేధించే గుణం అన్న‌ది ఉంటుంది క‌దా!అలాంట‌ప్పుడు సింప‌తీ అంతా ఆ..డాల్ వైపు చూపించి,ఆడాళ్లూ!మీకు జోహార్లు అని మాతో ఎందుకు రా చెప్పిస్తారు..మీ పుణ్యాలు ఉంటాయి త‌ప్పులు అంద‌రూ చేస్తారు..చేయ‌డానికే క‌దా!మాన‌వ జాతి ఉన్న‌ది..అలాంటప్పుడు మగాడికో రూలింగ్, ఆడదికో రైమింగ్ ఎందుక‌ని ఇస్తార్రా!ఈ నేప‌థ్యంలోనే భార్యా బాధితుల సంఘం పురుడు పోసుకుంది. మంచి ఫ‌లితాలు సాధించాల‌ని నేను కూడా ఆశిస్తున్నాను.

భార్య అంటే భ‌ర్త‌లో స‌గం అని చెబుతారు.అదేవిధంగా పూజించాలి ప్రేమించాలి అని కూడా చెబుతారు.వైదికం చెప్పే మాట‌లు విని చాలా మంది అలానే ఉంటారు కూడా! కానీ ప‌రిస్థితుల రీత్యా అలా ఉండ‌ని వారు కూడా ఉంటారు.మ‌రి!వారి క‌థేంటి? భార్య వేధించి రాచి రంపాన పెడితే వారిని ఆదుకునేదెవ్వ‌రు? ఇలాంటి ఆలోచ‌న‌ల నుంచి వ‌చ్చిందే భార్యా బాధితుల సంఘం.ఈ సంఘం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా, తాడేప‌ల్లి గూడెం,పెంట‌పాడు కేంద్రంగా ప‌నిచేస్తుంది.ఏటా మాదిరిగానే 2022 సంవ‌త్స‌రానికి సంబంధించి క్యాలెండ‌ర్ విడుద‌ల చేసి,త‌న నిబ‌ద్ధ‌త‌ను చాటుకుంది.ఈ సంఘం నేతృత్వంలోనే ప్ర‌జా యువ‌శ‌క్తి అనే పార్టీ కూడా న‌డుస్తోంది. ప్ర‌స్తుతానికి భార్యాబాధితుల సంఘానికి మ‌ద్ద‌తిస్తూ..ముగిస్తానిక!
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: