వెరీ స్పెషల్‌ 2022: మళ్లీ అలా 89 ఏళ్ల తర్వాతే..?

2022 సంవత్సరం వచ్చేసింది.. క్యాలండర్‌లో ఏటా ఓ సంవత్సరం మారుతూనే ఉంటుంది. అయితే కొన్ని సంవత్సరాలకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు ఉన్న సంవత్సరాలు చాలా అరుదుగా ఉంటుంటాయి. గణితంపై ఆసక్తి ఉన్నవాళ్లకు ఇలాంటి ప్రత్యేకతలు బాగా గుర్తుకొస్తాయి. అలాగే ఈ ఏడాది 2022 కూ ఓ ప్రత్యేకత ఉంది. ఇలాంటి ఏడాది రావడం చాలా అరుదుగా ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఏడాది చివరిసారిగా 23 ఏళ్ల క్రితం ఓసారి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే వచ్చింది.. ఈ 2022 తర్వాత మళ్లీ అలాంటి ప్రత్యేకత ఉన్న ఏడాది రావాలంటే.. కనీసం 89 ఏళ్లు పడుతుంది.

మరి ఇంతకీ ఆ ప్రత్యేకత ఏంటి. మిగిలిన సంవత్సరాలకూ 2022కూ ఉన్న ప్రత్యేకత ఏంటి.. గమనించారా.. గుర్తుపట్టారా.. అబ్బే మీకేమీ స్ఫురణకు రావడం లేదా.. కొందరు లెక్కల్లో ఫాస్ట్‌గా ఉండేవాళ్లు, గణిత విద్యార్థులైతే ఈ చిక్కుముడి సులభంగానే విప్పేస్తారు. సరే.. మీరు కనిపెట్టలేకపోతే ఆ విచిత్రం ఏంటో నేనే చెప్పేస్తాను లెండి.. 2022 నంబర్‌ను చాలా జాగ్రత్తగా గమనిస్తే.. దాని ప్రత్యేకత ఏంటో మీకు ఇట్టే అర్థమైపోతుంది. 2022 లో సున్నా సంఖ్య తప్ప మిగిలిన అంకెలు అన్నీ 2లు మాత్రమే.. అంటే 2022లో మూడు 2లు.. ఒక సున్నా ఉన్నాయి.. అంతే కదా..

ఇలా ఓ సంవత్సరం సంఖ్యనలో మూడూ ఒకే అంకెలు ఉండటం చాలా అరుదు.. మరి ఈ 2022కు ముందు అలా మూడు నెంబర్లు ఒకటే ఉన్న అంకె ఏంటో గుర్తువచ్చిందా.. అదే 1999.. అవును ఇది 23 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఒకే సంవత్సరం సంఖ్యలో మూడు అంకెలు ఒకే నంబర్‌ ఉండటం ఈ 2022తోనే వచ్చింది. మరి.. మళ్లీ ఇలాంటి నంబర్‌ రావాలంటే 89 ఏళ్లు ఎదురు చూడాల్సిందే. అప్పుడు 2111 ఏడాది వస్తుంది. మళ్లీ ఆ ఏడాదిలో మూడు 1లు ఉంటాయి..

ఇదీ 2022 ప్రత్యేకత.. అయితే 111, 1011, 1110, 1101, 1222, 1333, 1444, 1555, 1666, 1777, 1888 ఏడాదిల్లో కూడా ఇలాంటి ప్రత్యేకతే ఉంది. అయితే.. ఆ ఏడాదిలు చూసినవారెవరూ ఇప్పుడు బతికి ఉండే ఛాన్సు లేదు.. అదీ సంగతి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: