మార్నింగ్ రాగా : మేక్ ఎ క్యాలెండ‌ర్ మేడ్ ఎ డే..

RATNA KISHORE
అర్థం స్వేచ్ఛాయుతం
భావం యుక్తి రీతి
యుక్తి వైచిత్రి అని కూడా
రాశాను..
అవును! ఉక్తి వైచిత్రి కూడా అదే!
మార్నింగ్ రాగాలో
అను శ‌బ్దం గ‌తిలో దాగి ఉన్న ఉక్తి
నిక్షిప్తంలో ఉన్న జీవ ధార  
ఒక కొన ద‌గ్గ‌ర ఆగిపోయిన
స్వ‌రానికో ఊపిరి
జీవ ధార‌ల‌ను దేహాల‌కు అందించిన
ఓ గొప్ప వాన ఆకశాన..
జీవ ధారను సుసంప‌న్నం చేశాక
విశ్లేషణాత్మ‌క ప‌ద్ధ‌తులు
ఈ నేల‌కు పుల‌కింత పునీతం కూడా!
...............విశేషం వెల్ల‌డి....................
.......స్వేచ్ఛ అవ్య‌క్తం అన్ని సార్లూ..........
కావొచ్చు నాలో!

వేగంలో ఉన్నంత వ‌ర‌కూ జీవితం అస్త‌వ్య‌స్త‌త‌ల‌ను సైతం త‌న‌లో క‌లుపుకునే ఉంటుంది. అస్త‌వ్య‌స్త‌ల‌కు అవ‌ధి ఏమ‌యినా ఉందా అని ప్ర‌శ్నించుకుంటూ వెళ్తే.. ఒక ప‌రాధీనత సైతం ప‌ర‌మ ద‌రిద్రంగా అనిపిస్తోంది. ప్రాభ‌వం అన్న‌ది త‌ప్పు కాదు  కానీ ప‌రాధీన‌త అన్న‌దే జీవితాన్ని  అస్త‌వ్య‌స్తం చేస్తుంది. మ‌నుషులకు కొన్ని కృత‌జ్ఞ‌త‌లు.. అవి మ‌నలో నిక్షిప్తం అవ‌డానికి కాక‌పోవ‌డానికి మ‌ధ్య ఒక విభేద  గీత రాసి పోయినందుకు. ఈ ఏడాది ఆక‌ర్ష‌ణ అనిపించిన వ‌స్తువు లేదు. క‌విత్వం లేదు. ఎవ్వ‌రో అన్నారు మీరెందుకు అదే ప‌నిగా క‌విత్వం రాయ‌రు అని! ఆ ప‌ని నాది కాదు క‌నుక నేను చేయ‌ను. కొట్టుకుపోయిన కాగితాల్లో ఒక్క‌టి నాది అయినా ఆ ప్రాభ‌వం జీవితాన్ని విశేషించి నిర్వ‌ర్తించిన క‌ర్తవ్యాన్ని వెల్ల‌డి చేస్తుంది. మ‌నిషి ఒక ద‌గ్గ‌ర మాత్రమే నిష్ఫ‌లం అయి ఉంటాడు.. త‌న‌కు తెలియని వాటి ద‌గ్గ‌ర, త‌న‌కు అర్థం కాని అసంగ‌తం ద‌గ్గ‌ర..త‌న జ్ఞానాన్ని ప‌రీక్షించుకోవ‌డం అనే ఓ పెద్ద ప‌ని ద‌గ్గ‌ర.. ఒకరు అంటారు.


జ్ఞానాన్ని విసిరి కొడితే
ఇప్ప‌టి తెలివి అడ‌వికి ఇచ్చి వెళ్తే
ఏమ‌యినా ఈ ప్ర‌కృతి కానీ మ‌నిషి కానీ
ప‌రిర‌క్ష‌ణ‌కు నోచుకుని ఉంటారా?
అన్న‌దే లోప‌లి ప్ర‌శ్న.
క్యారెక్టర్ విల్ డిసైడ్స్ ఆల్....


ఇంత‌గా మ‌నల్ని మ‌నం ఇష్ట‌ప‌డ‌డం కూడా త‌ప్పేనేమో అని! న‌వ్వేను నేను.. ప్రేమ జ్ఞానం జీవితం అన్న‌వి ప‌రస్ప‌ర ఆధారితాలు కావు...విడి విడి ధాతువులు.. ప్రేమ‌ను జ్ఞాప‌కం ఆశ్ర‌యించి ఉంటుంది. జ్ఞాప‌కం జీవితాన్ని ఆశ్ర‌యించి ఉంటుంది. క‌నుక జ్ఞాప‌కం ప‌రాధీనం అయిన‌ప్పుడు ప్రేమ స్వ‌ప‌క్షం స్వకీయం కూడా.. స్వీక‌ర్త‌లు ఈ పాటి జ్ఞానాన్ని పొంది ఆ త‌రువాతే ఏద‌యినా ఆలోచించాలి.. మార్నింగ్ రాగా స్వీక‌ర్త .. అర్థ భావ గ‌తుల‌ను విస్తృతం చేయ‌గ‌ల స్వీక‌ర్త.. అందుకే సంక‌లిత స్వ‌రాల అచ్ఛాద‌నల్లో
అపభ్రంశ‌ల‌ను తొల‌గించి ప‌రిపూర్ణ‌త ను పొందేందుకు ఒక గుణాన్ని నిర్దేశిస్తూ ఉంటుంది. గుణాన్ని నిర్దేశించ‌డంలో స్వ‌చ్ఛ‌తకు ప్ర‌తీక అయి ఉంటుంది. విల‌క్ష‌ణ‌త‌కు ప్ర‌తీక అయి ఉన్న‌ప్పుడు ఇప్ప‌టి వాటితో ఉన్న విభేదాన్ని త‌ప్పక వెల్ల‌డించి కొత్త క్యాలెండ‌ర్ దారుల్లో కొత్త అనిపించిన కొన్ని  శ‌బ్ద భేరి గ‌తుల‌ను త‌ప్ప‌క వినిపించి వెళ్తుంది. సామ్యం చెల్లించి అర్థం వివ‌రించి వెళ్లిన గాలుల్లో ఈ ఉద‌య కాల సంవ‌ర్త‌నలు త‌ప్ప‌క వినిపిస్తాయి.
అర్థం సామాజిక రీతికి ప్ర‌త్యూష
స్వేచ్ఛ గ‌మ‌న రీతికి వ‌ర్ఛ‌స్సు
వెల్ల‌డిలో లేని  స్వేచ్ఛల్లో కూడా
దేహ గ‌తుల సంత‌ర్ప‌ణ‌ల‌ను
చూస్తూ వెళ్తాను
అర్థం చెల్లించి సామ్యం కుదిరిన చోటు
శ‌బ్ద సాంద్ర‌త  ఉన్న‌తిని ఉన్న‌తి వ‌ర‌కూ
ఆమూలాగ్రం  విశేషం అయి ఉంది...
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
(ఈ ఏటి విషాద జ్ఞాప‌కం ద‌గ్గ‌ర నేను)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: