మారుతున్న ఇయర్ లు ..మాయమవుతున్న మానవత్వ విలువలు..!

MOHAN BABU
మనలో మనం ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది.  అంగీకరిస్తారా..? తద్వారా నైతిక విలువలను జారిపోకుండా చూసుకోవచ్చు.. ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోవచ్చు.  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే సంస్కారంతో పాటు ఉన్నత స్థాయి విలువలనే మానవ విలువలు, నీతి అంతర్భాగంగా ఉంటాయి కనుక వాటిని నైతిక విలువలని అంటూ ఉన్నాం. ఇతర జంతుజాలంతో పోల్చుకుంటున్నప్పుడు నీవు మనిషివా ! పశువ్వా ! అని అంటూ ఉంటాం. ఆ రకంగా పశువులకు మనిషి కంటే అధమ స్థానాన్ని ఇవ్వడం ఒకరకంగా తప్పు అని అనిపిస్తుంది.
ఆలోచన, జ్ఞానము, అనుకరణ, వివేచన, విశ్లేషణ వంటి ఉన్నత మానసిక శక్తిసామర్థ్యాలు ఉన్నటువంటి మనిషిని ఆ అవకాశాలు లేనటువంటి పశువులతో పోల్చడం నిజంగా మొదటి తప్పిదంగా భావిస్తేనే పశువులకు గౌరవం, బుద్ధి జీవులైన మనుషులకు ఉన్నత స్థానం లభిస్తుంది.

 ప్రాథమికంగా ఈ అవగాహన లేకుంటే మనుషులను సృష్టిలోని ఇతర జీవరాశులను ఇష్టారాజ్యంగా పోల్చుకుంటూ విలువలను పక్కదారి పట్టించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది .తద్వారా సామాజిక వ్యవస్థ యొక్క పరిణతిని, మరింత మెరుగైన సమాజ నిర్మాణాన్ని అంచనా వేయడంలో ఒక సందిగ్దత దొర్లే ప్రమాదం ఉన్నది. ప్రక్షాళన వైపుగా మానవ సమాజం. విశ్వాసాలు, విలువలు, నిబంధనలు, సిద్ధాంతాలు, తగు ఆచరణల పునాదుల మీద ఏర్పడి నటువంటి సామాజిక జీవితం వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎన్నో ఒడిదుడుకులకు లోనవుతోంది. బలమైన తుఫాను, ఈదురు గాలులు, వర్షాల వలన పక్కా భవనాలు కూడా నేలమట్టం అవుతున్న విధంగా అనాదిగా మనము ఏర్పరచుకున్న టువంటి నైతిక విలువలు, ప్రేమ, ఆదరణ, ఆత్మీయత, ఆప్యాయత వంటి ఉత్తమ లక్షణాలు అప్పుడప్పుడు మనుషుల్లో కనుమరుగవుతున్నాయి.వాటి స్థానంలో స్వార్థం, అహంకారం, ఆధిపత్యం చొరబడడం వలన నిజమైన మానవుడు అంతరి స్తున్నాడు.

 అందుకే "మాయమవుతున్న డమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు" అని ప్రముఖ కవి అందెశ్రీ పాట రాస్తే సమాజములో అల్లుకున్న టువంటి వివిధ రకాల బలహీనతలు, స్వార్ధాలు, స్వ ప్రయోజనాలు, దాటవేత ధోరణి కారణంగా మనుషులు ఎలా ఆగమవుతున్నారో చెప్పే ప్రయత్నం నా సొంత పాట ద్వారా క్రింది విధంగా చేయడం జరిగింది.  ఆగమై పోతున్నది  జీవితం ఆగమై పోతున్నది-. మానవత్వం మంటకలిసిన ప్రతిచోట- డబ్బు చుట్టే మనిషి జీవితం తిరగంగా.-  ఆగమై పోతున్నది"". ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి తనను తాను మరిచిపోయి  స్వార్థానికి ఎగబడి వ్యవస్థ మరింత కూలిపోవడానికి కారణమవుతున్న నేపథ్యాన్ని ప్రధానంగా చేసుకొని పై పాటను నేను 10 సంవత్సరాల క్రితం  రాయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: