"ఇంటి లోన్" అప్లై చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి... ?

VAMSI
సొంతిల్లు అనేది అందరి కల. ప్రతి ఒక్కరూ ఒక మంచి ఇల్లు కట్టుకుని తమ ఇంట్లో తాము హాయిగా స్వేచ్చగా జీవించాలి అనుకుంటారు. సొంత ఇల్లు ఉంటే చాలు తిండి లేకపోయినా మన ఇంట్లో మనం పడి ఉండవచ్చు అని పెద్దలు అంటుంటారు. మన ఇంట్లో మనం ఉంటే ఆ హక్కే వేరు. అయితే భారతదేశంలో ఇప్పటికీ ఇల్లు లేని పేదలు ఎందరో ఉన్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలనే ఆశ పుష్కలంగా ఉంది. కానీ కట్టుకునేదుకు చేతిలో ఉన్న డబ్బులు సరిపోక ఆగిపోతున్నారు. ఇటువంటి వారి కోసమే బ్యాంకులు గృహం లోన్లు ఇస్తుంటాయి. ఇందుకు సొంత ఇల్లు లేదా లాండ్ పట్టా మీ పేరుపై ఉండాలి అన్న విషయం తెలిసిందే.
దాంతో చాలా మంది దైర్యం చేసి గృహం లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమవుతారు.  అయితే గృహ రుణం అనేది బాధ్యత ఎక్కువ కలిగిన అతిపెద్ద రుణం. ఈ రుణం తీసుకొనే ముందు ఒకటికి పదిసార్లు భవిష్యత్ గురించి ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే, ఈ రుణం తీసుకున్న తర్వాత భవిష్యత్తు లో కనుక పొరపాటున ఆర్ధిక ఇబ్బందులు ఎదురైతే పీకల్లోతు కష్టాల్లో మునిగి పోవాల్సి వస్తుంది. అందుకే, గృహ రుణం తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.  కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని రుణం తీసుకోవాలి. అవేంటో ఇపుడు చూద్దాం.
డౌన్ పేమెంట్: హౌజ్ లోన్  కోసం బ్యాంకులు 70-80 శాతం ఆర్థిక సహాయం ఇస్తున్నాయి. కానీ మనం మాత్రం మన ఇంటి ఆస్తి విలువలో 60 శాతం కంటే ఎక్కువ మించకుండా చూసుకోవాలి. దీనివల్ల హౌజ్ లోన్ త్వరగా మంజూరు అవుతుంది అలాగే వడ్డీరేటు తక్కువ పడి మనపై ఆర్ధిక ఒత్తిడి భారం తగ్గుతుంది.
ఈఎమ్ఐ: తీసుకున్న గృహం లోన్ ను విడతల వారీగా ప్రతి నెల చెల్లించాల్సి ఉండగా మీ స్థోమతను బట్టి నెలకు ఎంత కట్టాలో నిర్ణయించుకోవాలి. ప్రతి నెల కాస్త ఎక్కువ మొత్తం కట్టగలిగితే వడ్డీ భారం తగ్గుతుంది. అలా చేయలేని వారికోసం సుదీర్ఘ కాలం రుణం చెల్లించేందుకు ఆప్షన్ ఉంది.
క్రెడిట్ స్కోరు: మన క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు పిలిచి మరి రుణాలు ఇస్తాయి. అది కూడా చాలా సందర్భాల్లో తక్కువ వడ్డీకి కూడా ఇచ్చున్నారు.
అలాగే కొంత సొమ్మును కనీసం ఒక రెండు మూడు నెలల కు సరిపడా ఇ ఎం ఐ ను పక్కన పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఒకవేళ ఏవైనా సమస్య ఎదురైనపుడు ఆ డబ్బుని వాడి కష్టంలో నుండి గట్టెక్కవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: