హ్యాపీ క్రిస్మ‌స్ : గాడ్ ఎవ‌రు? ఫాద‌ర్ ఎవ‌రు?

RATNA KISHORE
ముళ్లున్న‌చోట దేవుడుంటాడా.. ఉంటాడు..
పూలున్న చోట దేవుడుంటాడా.. ఉంటాడు..
రాళ్లు కొన్ని పూలు కొన్ని ముళ్లు కొన్ని
జీవితాన్ని శాసిస్తే దేవుడు వ‌చ్చి ఆదుకుంటాడు
ఆదుకునే శ‌క్తిని తోడుగా ఇచ్చి పంపుతాడు


దేవుడు అనే శ‌బ్దం ఎంతో బాగుంటుంది. మ‌నిషికి ఓ నియంత్ర‌ణ ఆ శ‌బ్దం..దేవుని వాక్యం వినిపించే ఫాద‌ర్ కూడా ఎంతో ఉన్న‌తంగా ఉంటాడు. ఆ శ‌బ్దం విన్న వెంట‌నే మ‌నిషికి మ‌ళ్లీ ఓ నియంత్ర‌ణ.. ఓ బాధ్య‌త గుర్తుకు వ‌స్తాయి. దేవుడు అంటే నియంత్రించేవాడు అని అర్థం తీసుకోవాలి. చ‌ర్చిలోనో గుడిలోనో మ‌సీదులోనో ఎక్క‌డో ఓచోట కొలువై ఉన్న దేవుడు మ‌నకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు. పాటించాలి.. కొన్ని సూత్రాలు చెబుతాడు ఆచ‌రించాలి..దేవుడు అంటే ఆదేశం అని మ‌తం అంటే ఆచ‌ర‌ణ అని ఓ నిర్థిష్ట నిర్వ‌చ‌నం ఎవ‌రికి వారు పొంద‌గ‌ల‌గాలి. ఈ క్రిస్మ‌స్ వేడుక‌లు అలాంటివే నేర్పుతాయ‌ని భావిస్తాను నేను.
ఓ రోజు ఓ క్లిష్ట స్థితిలో నేనున్నాను.. ప్రాణాపాయాన్ని జ‌యించిన సంద‌ర్భంలో నేనున్నాను.. ఓ ఫాద‌ర్ ఫోన్ చేసి మీకేం కాలేదు క‌దా స‌ర్ అని అన్నారు..లేదండి నేను క్షేమం అని చెప్పాను.. నా ఇబ్బంది చెప్ప‌గానే మొద‌టి ఫోన్ ఓ ఫాద‌ర్ నుంచి వ‌చ్చింది.. ప్ర‌భువు త‌ర‌ఫున పిలుపు ఇది అని భావించి ఎంతో ఆనందించాను. భ‌గ‌వంతుడు కొన్ని ప‌నులు మాత్ర‌మే క‌ర్త‌వ్యాన్ని నిర్దేశించేందుకు అనుగు ణంగా ఎంపిక చేసి లోకానికి అంద‌జేస్తాడు. వాటి నిర్వ‌హ‌ణ‌లో తోటి వ్య‌క్తులు ప్ర‌కృతి సాయం చేస్తాయి..క్రిస్మ‌స్ వెలుగుల పండుగే కాదు నా దృష్టిలో ప్ర‌కృతి పండుగ కూడా! నేల త‌ల్లి ఒడిలో బిడ్డ‌లు అంతా క్షేమంగా ఉండాల‌ని త‌లిచే పండుగ క‌నుక అలాంటి ఫాద‌ర్ అలాంటి గాడ్ మీ జీవితాల్లోనూ ఉండాలి. దేవుడు ఆజ్ఞ మ‌నిషి మాత్ర‌మే పాటింపు అని ఎవ్వ‌రో చెప్పారు క‌దా అదే నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: