హ్యాపీ క్రిస్మస్ : మంచు సోనల నడుమ మహా సందేశం ఎలా ఉందంటే?

RATNA KISHORE
పండ‌గ అంటే ఆచారం కాదు ఆత్మీయానుభ‌వం అన్న‌ది ఓ ఫాద‌ర్ మాట. ప్రేమ ఆద‌రం అన్న‌వి పండుగ మాత్ర‌మే నేర్పే గుణాలు. ఇవి మాత్ర‌మే మ‌నం నేర్చుకుని ఒక చోట స్వీయానుభ‌వానికి ఉన్న‌తి ఇవ్వాలి.. ప్రేమ అన్న‌ది స్వీయానుభవం కానీ పంచే కొద్దీ అనుభ‌వం కొన్నింట ఆత్మీయం అయి ఉంటుంది.. అనుభ‌వం కొన్నింట అద్వితీయం అయి కూడా ఉంటుంది..ఆత్మీయత‌కు నెల‌వుగా నిలిచిన పండుగ‌లో దాతృత్వం ఒక భాగం.. పంచ‌డం ఒక భాగం.. పంచ‌డం అంటే ఉన్న‌ది ఇవ్వ‌డం..కాదు ఉన్న‌దాంట్లో ఎంతో కొంత ఇవ్వ‌డం..ఇవ్వ‌డంలో ఉన్న‌తి. పంచ‌డంలో ప్రేమ పండుగ కానుక అంటే ఇదే!


మంచు సోన‌లు కొన్ని ప్ర‌భువు పండుగ‌కు తోడుంటాయి.. ప్ర‌భువు రాక‌తో నేల పుల‌క‌రించి పోయింది.. జీవితం ఒక ధ‌న్య‌త‌ను పొందాలంటే ఇచ్చే గుణం ఒక‌టి మ‌నిషికి తోడుండాలి. క్రిస్మ‌స్ ఇచ్చే గుణాన్ని త‌న వెంట తెచ్చుకుని లోకానికి పంచి వెళ్తుంది.. చ‌ర్చిలో పంచే తీపి కానుక‌ల‌న్నీ ఇచ్చే గుణానికి సంకేతాలే.. ప్రేమ అన్న‌ది ఇచ్చే గుణాన్ని సంబంధిత త‌త్వాన్నే పెంపొందించి వెళ్తుంది.. ప్రేమ చీకటి నుంచి వెలుగు.. వెలుగు నుంచి విస్తృతి అన్నీ నేర్పి వెళ్తుంది..  చ‌ర్చి గేటు ద‌గ్గ‌ర గుమిగూడిన అభాగ్యుల‌కు అందించిన ప్రేమను ఏ చ‌రిత్ర నిక్షిప్తం చేయ‌దు క‌దూ! అదే గొప్ప ప్రేమ..


ఎన్నో అవ‌రోధాలు..ఎన్నో యుద్ధాలు..లోప‌ల క‌ల్లోలం..బ‌య‌ట ప్ర‌శాంతం..జీవితం నేర్పినంత..దేవుడు ఇచ్చినంత.. ఇత‌రుల నుంచి నేర్చుకోద‌గినంత..ఇవ‌న్నీ క్రిస్మ‌స్ ఉదయం బోధిస్తుంది. ప్రేమ ఉన్న చోట క్ష‌మ‌కు ఉన్న ఒక్క అర్థం మాత్రం విస్తృతం అయి ఉం టుంది. ఒక్కసారి కూడా ప్ర‌పంచం నుంచి వేరు అయి చేసే ఆలోచ‌న మ‌న‌లో ఉందో లేదో చూసుకోవాలి.. ప్ర‌పంచాన్ని ప్ర‌త్యేకంగా చూసే ఓ గొప్ప దృక్కు ఎవ‌రికి వారే సొంతం చేసుకోవాలి..చూపు బాగుంటే లోకం బాగుంటుంది. చూపు విస్తృతం అయిన చోట లోకం అందంగా నిర్మాణానికి నోచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. అంటే చూపు ఇక్క‌డ ప్రాథ‌మిక అవ‌గాహ‌నకు సంకేతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: