హ్యాపీ క్రిస్మ‌స్ : ప్రేమ క‌రుణ నిండిన యేస‌య్య‌కు!

RATNA KISHORE
ప్ర‌తిరోజూ నిరాశ‌లు ఉంటాయి..ప్ర‌తిరోజూ చిన్న చిన్న బాధ‌లు,దుఃఖాలు ఉంటాయి. క‌రుణించే ప్రేమ ఒక్క‌టి మాత్ర‌మే మ‌నుషులను వీటి నుంచి దూరం చేస్తుంది. ప్రేమ ఏమ‌యినా..ఎక్క‌డ‌యినా..ఎవ్వ‌రిద‌యినా గొప్ప‌గానే ఉంటుంది. ఈ క్రిస్మ‌స్ మ‌నుషుల మధ్య పెరిగే ప్రేమ‌కు కార‌ణం కావాలి. మ‌నుషుల మ‌ధ్య పెరిగే బాధ‌ను,అసూయ కార‌ణంగా పెరిగే బాధ‌ను తొలగించాలి. ప్రేమ నిండిన క‌ళ్లతో లోకాన్ని చూస్తే ప్ర‌భువు రాక ఓ కొత్త ఆనందానికి సంకేతిక. గుర్తు కూడా!

దేవుడి గురించి ఓ ప‌ర‌మ స‌త్యాన్ని బైబిల్ చెబుతుంది అని ఓ పాస్ట‌ర్ అంటున్నారు. ప్ర‌బోధ‌కులు అంటున్నారు. జీవితం నుంచి సత్యాన్ని ఏరుకోవ‌డం అన్న‌ది అనుభ‌వం నేర్పుతుంది. స‌త్యం అయినా..మ‌రో భావ‌న అయినా ఆకాశంలో తార‌ల్లా మెరిసే గొప్ప కాంతిని మ‌న జీవితాల్లో స‌జీవం చేయ‌డ‌మే కొన్ని జీవితాల‌కు ఓ ల‌క్ష్యం కావాలి.. ప్రార్థన ల‌క్ష్యం ఇదే కావాలి. మ‌నం ఓడిపోయి ఒక సత్యాన్ని వ‌దిలేస్తున్నాం..మ‌నం గెలిచిన గ‌ర్వంలో ప్రార్థ‌న ను విస్మ‌రిస్తున్నాం. భ‌గ‌వంతుడు దేహాల‌కు గాయాలు ప్ర‌సాదించి వెళ్లాడు. ఆయ‌న గాయాలకు ఏమ‌యినా మందులు ఇచ్చాడా అంటే అవును ! ప్ర‌తి గాయాన్నీ ప్రేమ మాత్ర‌మే మాన్పుతుంది.
 
మందులు,ఆస్ప‌త్రులు అన్న‌వి పైకి  కనిపించే నిత్య కృత్యాలు..కృత్యాధార చింత‌న ఒక‌టి ప్రేమ నేర్పుతుంది. అమ్మ‌నాన్న‌ల‌కు వందనాలు చెల్లించే వేళ బాల ఏసు లోకానికి ఇచ్చే సందేశం శాంతి మ‌రియు స‌హ‌నం. ఈ రెండూ ప్రేమ అల‌వాటు చేసి మ‌నుషులకు కొన్ని అద్భుతం అయిన క్ష‌ణాల‌ను ఇచ్చి వెళ్తుంది. అవును! ప్రేమ ఇదివ‌ర‌క‌టిలా ఉండ‌దు. కోపం కూడా ఇదివ‌ర‌కటిలా ఉండదు. మ‌నం చేసే ప్ర‌తి ప్రార్థ‌న ఇదివ‌ర‌క‌టి ల‌క్ష‌ణాల‌ను మెరుగు ప‌రుస్తాయి. మ‌నిషికి మార్పు అనే ఓ గొప్ప గుణం అందించి వెళ్తాయి. దైవ సందేశంలో ప్రేమ‌కూ క‌రుణ‌కూ త్యాగానికీ ఉన్న విలువ మ‌నుషుల ప‌రివ‌ర్త‌న‌లోనూ ఉండాలి. ఉంటుంది కూడా! ప్రాయిశ్చిత్తం చేసుకున్నాక పాప ప‌రిహారం త‌ప్ప‌క సాధ్యం అవుతుంది. ప్రేమ అమూల్యం..అయి ఉన్న చోటు భ‌గ‌వంతుడు కొన్ని కాంతులు నిర్దేశించి వెళ్లాడు..ఆ కాంతుల దారిలో ఈ క్రిస్మ‌స్ కొత్త ఆనందాల‌ను ఇవ్వాలి మీకు మ‌రియు మా అంద‌రికీ..ఈ వేళ మంచు సోనల న‌డుమ జాతి కోసం చేసే తొలి ప్రార్థ‌న.. మంచిని ప‌రివ్యాప్తం చేసే ప్రేమ‌కు తొలి ఆహ్వానం. 
అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌ల‌తో...
- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: