లైఫ్ స్టైల్: బీరువా దగ్గర ఇలా చేస్తున్నారు..!

Divya
ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి ఒక్కరి ఇంట్లో.. కబోర్డ్స్ నే బీరువా లాగా లేదా సరికొత్త బీరువాను కచ్చితంగా ఉంచుకుంటున్నారు. అంతే కాకుండా వాటికి ఒక మిర్రర్ లాంటిది అదేపనిగా తగిలించుకొని తీసుకుంటూ ఉంటారు. ఇక ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఇలాంటి బీరువాలపై ఎక్కువ మొగ్గుచూపుతున్నారు ప్రజలు. కానీ ఇలాంటి  బీరువాలు ఈ ఇళ్ళల్లో అయితే  ఉంటాయో.. అలాంటి ఇళ్లల్లో చాలా సమస్యలను ఎదుర్కొంటారట. అందులో ముఖ్యంగా డబ్బు సమస్య బాగా వెంటాడుతుందట. ఇలా జరుగుతుందని ఎంతోమంది శాస్త్ర నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.

బీరువా అద్దానికి.. మనిషి ఆర్థికంగా నష్టపోవడం కి గల సంబంధం ఏమిటని మీరూ అనుకుంటున్నారా..? మనం కష్టపడే ప్రతి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వాటిని భద్రంగా బీరువాలో దాచి పెడుతూ ఉంటాము. ఇక మనం ఎక్కువగా డబ్బు ని లక్ష్మీదేవి రూపంలో కొలుస్తూ ఉంటాము. అలాంటి లక్ష్మీదేవిని ఎక్కడపడితే అక్కడ శుభ్రం లేని చోట ఉంచకూడదు. ఏమాత్రం బీరువా చుట్టూ పరిసరాలలో చెత్త చెదారం ఉంటే లక్ష్మీదేవి అక్కడ నిలువ ఉండదు. ఎప్పుడూ కూడా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుచేతనే మన ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక మనం దాచుకొనే డబ్బుల బీరువా విషయంలో కూడా పలు జాగ్రత్తలను తీసుకోవాలి.
బీరువా కి కనుక మనం అద్దాన్ని అతికించుకున్నట్లయితే.. ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్లే.. ఎందుచేత అంటే ఆ బీరువాకు  అద్దం  ఉంటే మనం అక్కడికి వెళ్లి ముస్తాబవుతు ఉంటాము..ఇక బీరువా లో లక్ష్మి స్వరూపమైన డబ్బులు ఉంటాయి కాబట్టి ఆమె ముందు మనము అవడం వల్ల ఆమెకు అస్సలు నచ్చదట.. అందుకే బీరువాకి ఉన్న అద్దం ముందు మనం వస్తా పోవడం వల్ల మహాలక్ష్మి దేవి కోపం తెచ్చుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అట. అందుకే బీరువాకి అద్దం ఉండకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బీరువాలు లేకుండా సెల్ఫ్ మాత్రమే ఉన్నవారు డబ్బు, బంగారు నగలను ఎల్లప్పుడు దక్షిణం.. పశ్చిమ దిశ లకు మధ్యలో ఉండే నైరుతి మూలన భద్రపరుచుకోవచ్చు అని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: