లైఫ్ స్టైల్: ఇలా చేసి మీ ఇంట్లో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవచ్చట..!!

Divya
ఈ మధ్య కాలంలో ఇంటి అలంకరణ కైనా కావచ్చు లేదా కొన్ని ఆచారాలు పాటించడం వల్ల అయినా కావచ్చు చాలామంది ఇళ్ళలోకి ప్రవేశించగానే మనకు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి.. ముఖ్యంగా ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం ,ఆనందం అన్ని బాగా కలిసి వస్తాయని ఎంతో మంది విశ్వసిస్తూ ఉంటారు. కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా విద్యాసంస్థలు , వ్యాపార సంస్థలు , హాస్పిటల్స్ వంటి పలు రకాల సంస్థలలో కూడా మనం వీటిని గమనించవచ్చు. చాలా మంది నమ్మకం ఏమిటంటే లాఫింగ్ బుద్ధ విగ్రహాలను పెట్టుకోవడం వల్ల తాము చేపట్టిన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని భావిస్తారు.
అంతేకాకుండా కుటుంబంలో ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుందట. ఒక ఇంతటి పవిత్రమైన ప్రభావితమైన ఇంటిలో ఏ దిశలో పెట్టడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. ఇంటికి పడమర దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచినట్లయితే దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఏ సమస్య నుంచి అయినా విముక్తి పొందవచ్చు.. అదే కార్యాలయాలలో లాఫింగ్ బుద్ధను ఉత్తరదిశలో పెట్టడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు. ఈ విగ్రహాన్ని పెట్టేటప్పుడు కేవలం మన కంటికి కనిపించే అంత ఎత్తులో మాత్రమే ఉంచాలి.
అంతేకాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేలపై ఉంచరాదు. తూర్పు దిశలో ఈ విగ్రహం పెట్టడం వల్ల కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం రెండూ చేకూరుతాయి. ఇక ఈ లాఫింగ్ బుద్ధ పొట్టపై ప్రతిరోజు కుడిచేతితో ఒక్కసారైనా రుద్దటం వల్ల శుభం జరుగుతుంది. అంతేకాదు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఎలాంటి ఆకృతిలో ఉన్నప్పటికీ మనకు ఎటువంటి ఇబ్బంది కలగదు.  ఏ ఆకృతిలో ఉన్న సరే ఆ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది. ఈ విగ్రహాన్ని పరమ పవిత్రమైనదిగా భావించాలి. కాబట్టి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల శుభం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: