ఇండోనేషియా : ఇస్లాం నుండి.. హిందువుగా.. !

సుకర్ణోపుత్రి, ఈమె ఇండోనేషియా మాజీ అధ్యక్షుడి కుమార్తె. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈమెకు హిందూ మతం పట్ల ఆసక్తి ఉంది. దీనితో తాజాగా స్వతంత్రంగా హిందూ మతం స్వీకరించారు. అంటే ఈమె ఇస్లాం నుండి హిందూమతంలోకి అది కూడా ఇప్పటి పరిస్థితులలో మారారు. ఆమె వయసు 69. తాజాగా సుధీవాడని ఆచారం ప్రకారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె హిందూమతాన్ని స్వీకరించారు. ఆమె తండ్రి పేరుమీద ఉన్న బాలీలోని రీజెన్సీ లో ని సుకర్నో సెంటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. కానీ బాలీలో హిందూమత ఆచారాలు భారతదేశానికి కాస్త భిన్నంగానే ఉంటాయి.
రెండు దశాబ్దాలుగా ఆమె హిందూ దేవాలయాలను సందర్శిస్తూ ఉన్నారు. ఆమెకు సహజంగా కలిగిన ఆసక్తి మేరకు చేసినప్పటికీ, అతి త్వరలోనే హిందూమత ఆచారవ్యవహారాలు ఆకట్టుకోవడంతో అటువైపు అడుగులు వేసింది. ఇప్పటికే ఎన్నో సార్లు రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు చదివేశారు ఆమె. అలాగే హిందూమతం గురించి, ఆచారాల గురించి, సిద్దాంతాల గురించి ఆమెకు చాలా అవగాహన కూడా ఉంది. ఇండోనేషియా ఒకప్పటి డచ్ పాలన నుండి స్వేచ్ఛ పొంది స్వతంత్ర దేశంగా  అవతరించినప్పుడు తొలి అధ్యక్షుడిగా సుకర్నో తండ్రి ఉన్నారు. సుకర్నో తండ్రి 1945-67 వరకు ఇండోనేషియా ను పరిపాలించారు. అంటే దాదాపు 22 ఏళ్ళు ఆయన అధ్యక్షుడిగానే కొనసాగారు. ఇక సుకర్నోపుత్రి ఇండోనేషియా కు ఐదవ అధ్యక్షురాలిగా ఉన్నారు.
ఇలా పొరుగు దేశాలు భారత సంస్కృతిని గౌరవిస్తుంటే, మనవాళ్ళు మాత్రం దాని విలువ తెలియకుండా పాశ్చాత్య సంస్కృతివైపు ఆకర్షితులవుతున్నారు. అలా పొరుగువారి సంస్కృతిని నేర్చుకోవడం తప్పేమి కాదు కానీ, దానినే ఇష్టపడుతూ, సొంత సంస్కృతిని అవమానించడం కూడని పని.  అది ఇటీవల ఎక్కువగా జరుగుతుంది. కనీసం రేపటి తరాలకు భారతదేశం గురించి అవసరమైన జ్ఞానం కూడా పెద్దలు అందించలేకపోతున్నారు. దీనితో రేపటి రోజున సంస్కృతి కనుమరుగయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాశ్చాత్యులలో ఇలాంటి వారిని చూసైనా మనవాళ్ళు అసలు భారతీయులు గా మారితే బాగుంటుంది. సొంత సంస్కృతిని అనుసరించడం అంటే అదేమీ మతఛాందసవాదం కాదు. మన మతం గురించి మాట్లాడాలి, సంస్కృతి గురించి చెప్పగలగాలి, పాటించాలి. ఇవన్నీ దేశభక్తి కిందకే వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: