జైలులో రామాయణం.. చదవొచ్చా..!

నేడు భారతదేశంలో పాశ్చాత్య సంస్కృతి పాటించడం బాగా ఎక్కువ అయ్యింది. దీనితో స్వదేశీ సంస్కృతి, సాంప్రదాయాలు, దేశం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, దేశం ఎలా ఏర్పాటు చేయబడింది, స్వాతంత్రం ఎలా వచ్చింది లాంటి అనేక విషయాలు నేటి యువతకు కనీస అవగాహన లేదనే చెప్పాలి. అలాంటివి ఆలోచించాలి అంటేనే అదేదో సమయం వృధా చేసినట్టుగా భావిస్తున్నారు. అందుకే ఇవన్నీ ఇబ్బందులు ఎందుకని పెద్దలు ఎటు పోతుంటే వాళ్ళు కూడా అదే బాట పడుతున్నారు. దాదాపుగా పెద్దలు పాశ్చాత్య సంస్కృతి అంటేనే ఇష్టపడుతూ అటువైపు పరుగెడుతున్నందున పిల్లలు కూడా అదే లోకం అనుకుంటున్నారు. కానీ తమకు ఒక వ్యక్తిత్వం ఉంది అనే కనీస ఆలోచన వాళ్లలో రావడం లేదు.
దీనితో పుబ్బులు, పార్టీలు, సరదాలు, రేసులు తప్ప పెద్దగా వేరే లోకం కూడా వాళ్లకు ఉండటంలేదు. ఇవన్నీ పెద్ద వాళ్ళ విషయంలోనూ మధ్య తరగతి వారి విషయంలోనూ అంతే ఉంటున్నాయి. కనీసం అలాంటి స్నేహాలు ఉండటం చేత వాళ్లలో స్వదేశీ పట్ల కనీస బాధ్యత కూడా ఉండటంలేదు. దీనితో సరదా అంటూ లేనిపోని అలవాట్లకు లోనవుతూ, తరువాత వాటికే బానిసలై, బయటపడటం తెలియక అందులోనే కొట్టు మిట్టాడుతున్నారు. ఇవన్నీ కనీసం వారివారి ఇంట్లో పెద్దలకు కూడా తెలియకుండానే జరిగిపోతుండటం మరీ ఆశ్చర్యకరమైన విషయాలు. ఆ స్థాయిలో పెద్దలు కూడా సంపాదన అంటూ పరుగులు పెడుతున్నారు తప్ప పిల్లలపట్ల కనీస బాధ్యతలు కూడా నెరవేర్చలేకపోతున్నారు.
ఆ ఒంటరి తనం వాళ్లలో ఒక నిరుత్సహన్ని నింపుతుంది. అది డబ్బుతో కనిపించకుండా దాచేసుకుంటూ బ్రతికేస్తున్నారు. భారతదేశం మొదటి నుండి తన బ్రతుకు తాను బ్రతుకుతున్నప్పటికీ శత్రువులు తప్పడం లేదు. ఎక్కడ భారత్ ఉన్నత స్థానంలోకి వెళ్తుందేమో అనే అక్కసుతో ఆయా దేశాలు ఎప్పుడు ఒక కన్ను భారత్ పై వేసి, వీలైనప్పుడల్లా ఆయా వ్యూహాలతో(దొంగ దెబ్బలతో) యువతను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారు. అందుకే భారత్ లోకి మాదకద్రవ్యాలు వస్తున్నాయి. అవి సరాసరి యువతను లక్ష్యంగా చేసుకుని శత్రువులు పన్నిన కుట్రలో భాగంగా వారిలోని బాధను తగ్గించేవిగా చూపిస్తూ దానికి బానిసలను చేస్తున్నాయి. ఇలా కాకుండా పెద్దలు లేదా ముందు తరాలు సంపాదన వాళ్లకు, పిల్లలకు సరిపడా వస్తుందా అనేది చూసుకొని, అనంతరం పిల్లలతో సమయం గడుపుతూ, వాళ్లకు ఆయా మతగ్రంధాలలోని ధార్మిక జీవనం గురించి లేదా భారతదేశం గురించి, ఆ దేశ స్వాతంత్రం కోసం ఎవరెవరు త్యాగాలు చేశారు వంటి గాధలు చెప్పడం ద్వారా వారిలో ఒంటరితనం తగ్గి, మానసిక స్తైర్యం పెరిగి ధైర్యంగా ముందుకు నడుస్తారు. లేదంటే శత్రువుల వ్యూహాలలో బలిపశువులు అయిపోతారు. ఆర్యన్ ఖాన్ కూడా శత్రువుల చేతిలో పరిస్థితుల చేతిలో బలైపోయాడు అంతే. ఇది ఈ తరం తప్పు కాదు, ముందు తరాల అజాగర్త మాత్రమే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: